<font face="mangal" size="3px">ఎకో ఇండియా ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ప్రైవేట - ఆర్బిఐ - Reserve Bank of India
ఎకో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
మార్చి 21, 2017 ఎకో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు PSS యాక్ట్, 2007లోని సెక్షన్ 30 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, RBI నిబంధనలు పాటించనందుకు మరియు తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు గాను ఎకో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు (సంస్థ) రూ.5 లక్షలు (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. ఆ సంస్థ ఇచ్చిన రిటర్న్ లను పరిశీలించిన అనంతరం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆ సంస్థ కు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, దానికి ప్రతిగా ఆ సంస్థ రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కేసులోని వాస్తవాలను, ఆ సంస్థ ఇచ్చిన జవాబును పరిశీలించిన పిమ్మట, ఆ సంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ధారించినది. అనిరుధ డి.జాదవ్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2516 |