<font face="mangal" size="3px">సతారా జిల్లా, వ‌య్ లోని హరిహరేశ్వర్ సహకారి బ - ఆర్బిఐ - Reserve Bank of India
సతారా జిల్లా, వయ్ లోని హరిహరేశ్వర్ సహకారి బ్యాంక్ కు జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
మార్చి 21, 2017 సతారా జిల్లా, వయ్ లోని హరిహరేశ్వర్ సహకారి బ్యాంక్ కు జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 47 A (1) (b) రెడ్ విత్ సెక్షన్ 46 (4) ద్వారా సంక్రమించిన (సహకార సంఘాలకు వర్తించే) అధికారాలను అనుసరించి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 20 లో డైరెక్టర్ల ఆస్తుల పూచీగా రుణాలు మంజూరు చేయడానికి వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందకు గాను ఆ బ్యాంకుపై రూ.2 లక్షలు (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, దానికి ఆ బ్యాంకు రాతపూర్వకంగానే కాకుండా మౌఖికంగా కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంకు ఇచ్చిన జవాబును పరిశీలించిన పిమ్మట, ఆ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అనిరుధ డి.జాదవ్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2515 |