RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507184

జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణాపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది

తేదీ : జులై 09, 2018

జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణాపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c) (సెక్షన్‌ 46 (4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకు లి., హైదరాబాద్, తెలంగాణాపై, రూ. 25,000 (రూపాయిలు ఇరవై ఐదు వేలు) నగదు జరిమానా విధించినది. యు సి బి ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను / మార్గదర్శకాలను ఉల్లంఘించినందువల్ల, ఈ జరిమానా విధించడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్, జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, లిఖితపూర్వక జవాబు సమర్పించినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంకుయొక్క జవాబు, ప్రత్యక్ష విన్నపాలు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/80

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?