<font face="mangal" size="3">కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహ - ఆర్బిఐ - Reserve Bank of India
కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది
సెప్టెంబర్ 07, 2018 కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1) లోని అధికారాలను వినియోగించుకొని, సంచాలకులకు సంబంధించిన రుణాలు ఇవ్వడంలో భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నిర్దేశాలు/సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 5.00 (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానం మరియు మౌఖిక జవాబులు సమర్పించింది. కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అనిరుద్ధ డి జాదవ్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/577 |