<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్‌చే మోడల్ కో-ఆపరేటివ్ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్చే మోడల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణా, పై జరిమానా విధింపు
ఆగస్ట్ 16, 2016 భారతీయ రిజర్వ్ బ్యాంక్చే మోడల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A (1) (b) (సెక్షన్ 46 (4) తోకలిపి), ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, మోడల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణా పై, బ్యాంక్ డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాల జారీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాలు/ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, ₹ 1. 00 లక్ష (కేవలం రూపాయిలు ఒక లక్ష) నగదు జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీస్కు బ్యాంక్ లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈ సంఘటనలో వాస్తవాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధించదగ్గవి అయినట్లు, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2016-2017/425 |