<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్‌చే శ్రీకాళహస్తి కో-ఆ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్చే శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్,
జూన్ 07, 2016 భారతీయ రిజర్వ్ బ్యాంక్చే శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A (1) (b) (సెక్షన్ 46 (4) తోకలిపి), ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, శ్రీ కాళహస్తి టౌన్ బ్యాంక్ లిమిటెడ్, శ్రీ కాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ పై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెక్షన్ 20 మరియు 20 A ఉల్లంఘించినందుకు, మరియు బ్యాంక్ డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాల జారీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాలు/ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, ₹ 1. 00 లక్ష (కేవలం రూపాయిలు ఒక లక్ష) నగదు జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీస్కు బ్యాంక్ లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈ సంఘటనలో వాస్తవాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధించ దగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది. సంగీతా దాస్ పత్రికా ప్రకటన : 2015-2016/2841 |