<font face="mangal" size="3">ది నీడ్స్ అఫ్ లైఫ్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిట - ఆర్బిఐ - Reserve Bank of India
ది నీడ్స్ అఫ్ లైఫ్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ముంబై, పై ఆర్.బి.ఐ నగదు జరిమానా విధింపు
అక్టోబర్ 10, 2017. ది నీడ్స్ అఫ్ లైఫ్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ముంబై, పై ఆర్.బి.ఐ నగదు జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1)(b) మరియు సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారంరిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో ది నీడ్స్ అఫ్ లైఫ్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ముంబై, పై రూ. 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది. డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు లోన్స్ మరియు అడ్వాన్సులకు సంబంధించిన; మరియు వారికి సంబంధం ఉన్న నిమిత్తములకు సెక్యూరిటీ లేని ఓవర్ డ్రాఫ్ట్స్; బ్యాంకు డొనేషన్ ఇచ్చేడందులకు; వ్యక్తిగత షేర్ హోల్డింగ్ 5 శాతం సీలింగ్ పాటించడం; రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ మరియు హౌసింగ్ లోన్స్ ఎక్ష్పొజరు పరిమితిని పాటించడం; వసూలు కాని సెక్యూరిటీలేని ఎక్ష్పొజరు లిమిట్ 10 శాతం కు లోబడి; సెక్యూరిటీ లేని వ్యక్తిగత ఋణ పరిమితి రూ. 2.00 లక్షలు లోబడి ; మరియు డిపాజిటర్ల ఎడ్యుకేషన్ మరియు అవగాహన నిధి రుసుము పంపించడం; సంబంధించిన రిజర్వు బ్యాంకు ఆదేశాలు మరియు నిబంధనలు ఆ అర్బన్ బ్యాంకు ఉల్లంఘించినందులకు, ఈ జరిమానా విధించడం జరిగింది. 2. రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినది. సెప్టెంబర్ 04, 2017 తేదీన బ్యాంకు వ్యక్తిగత విచారణకు రాలేదు. నిజానిజాలు పరిశీలించిన తరువాత, పైన పేర్కొన్న ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంకు నిర్ణయానికి వచ్చినది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/981 |