RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497660

ద తుంకూర్ వీర‌శైవ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌, తుంకూర్‌, క‌ర్ణాట‌క‌కు జ‌రిమానా విధించిన భార‌తీయ రిజర్వ్ బ్యాంక్

అక్టోబ‌ర్ 19, 2016

ద తుంకూర్ వీర‌శైవ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌, తుంకూర్‌, క‌ర్ణాట‌క‌కు జ‌రిమానా విధించిన
భార‌తీయ రిజర్వ్ బ్యాంక్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 47 A (1) (b) రెడ్ విత్ సెక్షన్ 46 (4) ద్వారా సంక్రమించిన (సహకార బ్యాంకులకు వర్తించే) అధికారాలను అనుసరించి, గత ఏడాది లాభాలలో 1 శాతం మించి డొనేషన్లు ఇవ్వడాన్ని నిషేదిస్తూ ఏప్రిల్ 11, 2005న జారీ చేసిన సర్క్యులర్ లోని మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను మరియు వ్యక్తులు కాకుండా ఇతరులు అకౌంట్లు తెరిచే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ జూలై 1, 2015 న జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ లోని సబ్ పేరా (iv) (d), 3.2.2.1 (B) లో ఉన్న KYC/AML మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను ఆ బ్యాంకుపై రూ.10 లక్షలు (పది ల‌క్ష‌ల‌ రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించింది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, దానికి ఆ బ్యాంకు రాత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వ‌డం జరిగింది. ఈ కేసులోని వాస్త‌వాల‌ను, బ్యాంకు ఇచ్చిన జ‌వాబును ప‌రిశీలించిన పిమ్మ‌ట‌, ఆ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చిన రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

అజిత్ ప్ర‌సాద్
స‌హాయ స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-17/971

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?