<font face="mangal" size="3">యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్ - ఆర్బిఐ - Reserve Bank of India
యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, స్టేషన్ రోడ్ (నార్త్), పోస్ట్-బాగ్నన్, జిల్లా-హౌరా, పశ్చిమ బెంగాల్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది
తేదీ: 16/05/2018 యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, స్టేషన్ రోడ్ (నార్త్), పోస్ట్-బాగ్నన్, క్రింద ఉదహరించిన ఆదేశాలు మరియు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(2)&(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(a)&(c) లోని అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు, యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, స్టేషన్ రోడ్ (నార్త్), పోస్ట్-బాగ్నన్, జిల్లా-హౌరా, పశ్చిమ బెంగాల్ ఫై రూ.5.00 లక్షలు (ఐదు లక్షల రూపాయలు) జరిమానా విధించింది. ఎ. కార్యాచరణ క్షేత్రం, బ్రాంచ్ ఆథరైజేషన్ పాలసీ, ఎక్స్టెన్షన్ కౌంటర్ల ప్రారంభం మరియు వాటి మెరుగుదల, వృద్ధి, ఎటిఎంలు మరియు కార్యాలయాల విభజన/ తరలించడం/మూసివేయడం ఫై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క జూలై 1, 2015 తేదీ నాటి మాస్టర్ సర్కులర్ ఆదేశాలు మరియు, మార్గదర్శకాల ఉల్లంఘన; బి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (AACS) యొక్క సెక్షన్ 35 (2) ఉల్లంఘన. మార్చి 31, 2016 నాటి బ్యాంక్ తనిఖీ ఫలితాల ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకుకు జారీచేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంకు, ఆర్బిఐ, కోల్కతా ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీకి లిఖిత పూర్వకంగా మరియు వ్యక్తిగతంగా సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంకు ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/3013 |