<font face="mangal" size="3px">భారతీయ రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ (క్రొత - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ (క్రొత్త) శ్రేణి లో ₹ 10 బ్యాంకు నోట్లను విడుదల చేసింది
జనవరి 05, 2018 భారతీయ రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ (క్రొత్త) శ్రేణి లో భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్. పటేల్ సంతకంతో మహాత్మా గాంధీ (క్రొత్త) శ్రేణి లో త్వరలోనే ₹ 10 విలువ కలిగిన బ్యాంకు నోట్లను విడుదల చేస్తుంది. క్రొత్త డినామినేషన్ నోట్ల పృష్ణ భాగం (వెనుక వైపు) లో ముద్రించిన సన్ టెంపుల్, కోణార్క్, దేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని చిత్రీకరిస్తుంది. నోట్ యొక్క మూల వర్ణం చాక్లెట్ బ్రౌన్. నోట్ ఇతర ఆకృతులు, జ్యామితీయ నమూనాలు మొత్తం ముందు వైపు, వెనుక వైపు మూల రంగు పథకంతో సమలేఖనం చేయబడ్డాయి. ముందరి శ్రేణిలలో రిజర్వు బ్యాంకు జారీ చేసిన ₹ 10 విలువ కలిగినవి కూడా చట్టపరమైన బ్యాంకు నోట్లుగా చెలామణి అవుతాయి. మహాత్మా గాంధీ (క్రొత్త) శ్రేణి లో ₹ 10 విలువ కలిగిన బ్యాంకు నోట్లు యొక్క చిత్రం మరియు విశిష్ట లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి: ii. విశిష్ట లక్షణాలు ముందు భాగం (ముందు వైపు) 1. సీత్రూ రిజిస్టర్ లో 10 విలువ కలిగిన సంఖ్య 2. దేవనాగరిలో १० సంఖ్య 3. నోటు మధ్యలో మహాత్మా గాంధీ యొక్క చిత్రం, 4. మైక్రో లెటర్స్ 'RBI', 'भारत', 'ఇండియా' మరియు '10' 5. 'भारत’ మరియు ‘RBI’ తో దారపు పోగు (సెక్యూరిటీ త్రెడ్) 6. గ్యారంటీ షరతు, వాగ్దాన షరతు తో గవర్నర్ సంతకం, మహాత్మా గాంధీ చిత్రపటానికి కుడి వైపున ఆర్బిఐ చిహ్నం 7. కుడి వైపున అశోక స్థంభం చిహ్నం 8. మహాత్మా గాంధీ చిత్రం మరియు ఎలెక్ట్రోటైప్ వాటర్ మార్క్ 9. ఫై వైపు ఎడమ భాగంలో మరియు క్రింది వైపు కుడి భాగంలో ఆరోహణ క్రమంలో నెంబర్ ప్యానెల్ వెనుక భాగం (వెనుక వైపు) 10. ఎడమవైపున నోట్ ముద్రణ సంవత్సరం 11. స్వచ్ఛ్ భారత్ గుర్తు మరియు నినాదం 12. భాషా ప్యానెల్ 13. సన్ టెంపుల్, కోణార్క్ చిత్రం 14. దేవనాగరిలో १० సంఖ్య బ్యాంకు నోట్ల పరిమాణం 63 mm x 123 mm గా ఉంటుంది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/1848 |