<font face="Mangal" size="3">ఇన్ సెట్ అక్ష‌రం ‘R’ క‌లిగిన రూ.2000 బ్యాంకునోట్ల - ఆర్బిఐ - Reserve Bank of India
ఇన్ సెట్ అక్షరం ‘R’ కలిగిన రూ.2000 బ్యాంకునోట్ల జారీ
నవంబర్ 08. 2016 ఇన్ సెట్ అక్షరం ‘R’ కలిగిన రూ.2000 బ్యాంకునోట్ల జారీ భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లో భాగంగా రూ.2000 మూల్యవర్గంలో ‘R’ అన్న ఇన్ సెట్ అక్షరం కలిగిన, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం 2016 అని ముద్రించిన కొత్త డిజైన్లో ఉన్ననోట్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు జారీ చేయనున్న ఈ కొత్త నోట్ల డిజైన్ అన్ని రకాలుగా నవంబర్ 8, 2016న జారీ చేసిన ప్రెస్ రిలీజ్ నెం. 1144లో పేర్కొన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్లోని రూ.2000 నోట్లను పోలి ఉంటుంది. గతంలో నవంబర్ 8, 2016న జారీ చేసిన ప్రెస్ రిలీజ్ నెం. 1144 ద్వారా విడుదల చేసిన బ్యాంకునోట్లు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. అల్పనా కిల్లావాలా ప్రెస్ రిలీజ్ : 2016-2017/1145 |