<font face="mangal" size="3px">డా. శివాజీరావ్ పాటిల్ నిలాంగేకర్ అర్బన్‌ కో - ఆర్బిఐ - Reserve Bank of India
డా. శివాజీరావ్ పాటిల్ నిలాంగేకర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లి. నిలాంగా, లాటూర్ జిల్లా, మహారాష్ట్రకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు జారీ చేసినది
తేది: 22/02/2019 డా. శివాజీరావ్ పాటిల్ నిలాంగేకర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లి. నిలాంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డా. శివాజీరావ్ పాటిల్ నిలాంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నిలాంగా, లాటూర్ జిల్లా, మహారాష్ట్రకు, ఫిబ్రవరి 16, 2019 పనిముగింపు వేళనుండి, ఆరు నెలల కాలానికి నిర్దేశాలు జారీచేసినది. ఈ నిర్దేశాల అనుసారంగా, డా. శివాజీరావ్ పాటిల్ నిలాంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నిలాంగా, లాటూర్ జిల్లా, రిజర్వ్ బ్యాంక్ సూచించినమేరకు తప్ప, వారి లిఖితపూర్వక అనుమతి లేనిదే, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులుతీసుకొనుట/ క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటవంటి రుణ భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు. ఇంతేగాక, ఈ నిర్దేశాలు అమలులో ఉన్న కాలంలో (అనగా ఫిబ్రవరి 16, 2019 నుండి, ఆరు నెలలు), ప్రతి సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతాలో (ఏ పేరుతో పిలవబడినా), గల నిల్వనుండి, రూ. 1,000/- (కేవలం ఒక వెయ్యి రూపాయిలు) మించకుండా ఒక్కసారి విత్డ్రా చేయుటకు మాత్రమే, బ్యాంక్ అనుమతించవచ్చు. అయితే, ఖాతాదారు, ఏవిధంగానైనా (రుణగ్రహీతగాగాని, స్యూరిటీగాగాని) బ్యాంకుకు బాకీ ఉన్నట్లయితే, ఈసొమ్ము, మొదట అట్టి బాకీ తీర్చుటకు సరిపెట్టవలెను. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ (1) సెక్షన్ 35A క్రింద (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలను జారీ చేసింది. నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారం కోసం, డా. శివాజీరావ్ పాటిల్ నిలాంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ప్రాంగణంలో ప్రదర్శింపబడినది. పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. అనిరుద్ధ డి జాధవ్ పత్రికా ప్రకటన: 2018-2019/2009 |