<font face="mangal" size="3">కేరళ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నం. 2626, కో&# - ఆర్బిఐ - Reserve Bank of India
కేరళ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నం. 2626, కోజికోడ్, కేరళకు,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు జారీ చేసినది
తేది: 04/06/2019 కేరళ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నం. 2626, కోజికోడ్, కేరళకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మే 29, 2019 తేదీన జారీచేసిన ఆదేశాలద్వారా, కేరళ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నం. 2626, కోజికోడ్, కేరళను నిర్దేశాల పరిధిలోకి తెచ్చినది. ఈ నిర్దేశాలను అనుసరించి, ప్రతి సేవింగ్స్ బ్యాంక్/ కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతాలో (ఏ పేరుతో పిలవబడినా), గల నిల్వనుండి, రూ. 2,000/- (కేవలం రెండు వేల రూపాయిలు) మించకుండా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకులోబడి, ఒక్కసారి విత్‌డ్రా చేయుటకు మాత్రమే, బ్యాంక్ అనుమతించవచ్చు. ఇంతేగాక, కేరళ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నం. 2626, కోజికోడ్, కేరళ, రిజర్వ్ బ్యాంక్ మే 29, 2019 జారీ చేసిన నిర్దేశాలలో తెలిపినమేరకు తప్ప, వారి లిఖితపూర్వక అనుమతి లేనిదే, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులుతీసుకొనుట/ క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటవంటి రుణ భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని, ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు. ఈ నిర్దేశాలు జూన్ 04, 2019 పనిముగింపు వేళనుండి, ఆరునెలల కాలం అమలులో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్, పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలను జారీ చేసింది. నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారం కోసం, కేరళ మర్కమంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ప్రాంగణంలో ప్రదర్శింపబడినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2862 |