<font face="mangal" size="3">నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంకు లిమిటె - ఆర్బిఐ - Reserve Bank of India
నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంకు లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్రకు,
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల జారీ
డిసెంబర్ 29, 2016 నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంకు లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్రకు, సెప్టెంబర్ 8, 2015 తేదీన జారీ చేసిన నిర్దేశాల ద్వారా, నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్ లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్రపై, సెప్టెంబర్ 9, 2015 పనివేళల ముగింపునుండి ఆరు నెలల పాటు ఆంక్షలు విధించడం జరిగింది. ఈ కాలపరిమితి, మార్చ్ 03, 2016 మరియు ఆగస్ట్ 25, 2016 న జారీ చేసిన నిర్దేశాల ద్వారా ఆరునెలలు పొడిగించబడింది. మాచే, సెప్టెంబర్ 08, 2015, మార్చ్ 03, 2016 మరియు ఆగస్ట్ 25, 2016 తేదీలలో నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్‌కు జారీ చేయబడ్డ ఆదేశాల ద్వారా, పేరాగ్రాఫ్ 1 (i) లో సూచించబడిన నిర్దేశాలు, డిసెంబర్ 26, 2016 న జారీ చేయబడ్డ ఉత్తరువుల ద్వారా, ఈ క్రింద తెలిపిన మేరకు పాక్షికంగా, సవరించబడినవని ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమయినది. (i) రుణ ఒప్పందంలోని షరతులు/నిబంధనలు బాకీదారుని డిపాజిట్ అకౌంట్లలోని (ఏ పేరుతో పిలవబడినా) సొమ్ము, వారి బకాయిల చెల్లుబాటుకు/సవరింపుకు వినియోగించవచ్చునని నియమము కలిగి ఉంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్ల సొమ్ముతో అట్టి బకాయిలు ఈ క్రింది షరతులతో చెల్లుచేయుటకు బ్యాంక్, అనుమతించబడినది:
(ii) ఇతర సక్రమ రుణాలు, సెక్యూర్డ్ CC ఖాతాలు (డైరెక్టర్లకు సంబంధించినవి తప్ప), అమలులోనున్న నియమ నిబంధనలతో నవీకరించుటకు, బ్యాంక్ అనుమతించబడినది. డిసెంబర్ 26, 2016 తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రతి, నాశిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్ వారి ఆవరణలో, ప్రజల పరిశీలనార్ధం ప్రదర్శించబడినది. కేవలం పై సవరణ చేసినంతమాత్రాన, బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితిలో విశేషమైన అభివృద్ధి కలిగిందని, రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినదని భావించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/1698 |