RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78475957

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, శ్రీ గోవర్ధన్‌సింగ్‌జీ రఘువంశి సహకారి బ్యాంక్ లి. నందుర్బార్, మహరాష్ట్ర, కు నిర్దేశాల జారీ

సెప్టెంబర్ 9, 2015

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, శ్రీ గోవర్ధన్‌సింగ్‌జీ రఘువంశి సహకారి బ్యాంక్ లి. నందుర్బార్, మహరాష్ట్ర, కు నిర్దేశాల జారీ

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35 (A), సబ్ సెక్షన్‌ (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ద్వారా తమకు సంక్రమించిన అధికారాలతో, మరియు సెక్షన్‌ 56, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, క్రింద భారతీయ రిజర్వ్ బ్యాంక్, శ్రీ గోవర్ధన్‌సింగ్‌జీ రఘువంశి సహకారి బ్యాంక్ లి., నందుర్బార్, మహారాష్ట్రకు, నిర్దేశాలు జారీ చేసినట్లు ప్రకటించింది. అందువల్ల, సదరు బ్యాంక్, ఆర్ బి ఐ సెప్టెంబర్ 8, 2015 తేదీన జారీ చేసిన నిర్దేశాల మేరకు తప్ప, ముందుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి పొందనిదే, సెప్టెంబర్ 9, 2015 పని ముగింపువేళ నుండి -

అప్పులు, ఋణాలు జారీ చేయరాదు మరియు నవీకరించరాదు: క్రొత్త పెట్టుబడులు పెట్టరాదు: అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపోజిట్లు అంగీకరించుటతో సహా, ఎటువంటి ఋణభారము స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నెరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి, రాజీ, సర్దుబాటు ఒప్పందములు చేసుకొనరాదు; వారి ఆస్తులను, సంపత్తులను అమ్మరాదు, బదిలీ చేయరాదు. సెప్టెంబర్ 8, 2015 న జారీచేసిన ఆదేశాల ప్రతి, ఆసక్తిగల ప్రజల సమాచారంకోసం, శ్రీ గొవర్ధన్‌సింగ్‌జీ రఘువంశి సహకారి బ్యాంక్ వారి ఆవరణలో ప్రదర్శింపబడింది. ప్రత్యేకించి, ఆర్ బి ఐ ఆదేశాల ప్రకారం, ప్రతి సేవింగ్స్ బ్యాంక్ , కరెంట్ అకౌంట్, డిపోజిట్ ఖాతా, ఇంకేదేని పేరుతొ పిలువబడే ఏ ఖాతాలోని మొత్తం నగదు నిల్వనుండి, 1000/- (అక్షరాలా వెయ్యి రూపాయిలు) వరకు మాత్రమే తీసుకోవడానికి బ్యాంక్ సమ్మతించాలి.

ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినట్లు ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేవరకు, బ్యాంక్ కొన్ని నిబంధనలతో తమ కార్య కలాపాల్ని కొనసాగిస్తుంది. పరిస్థితుల్ని పరిశీలించి, రిజర్వ్ బ్యాంక్, ఈ నిర్దేశాల్లో సవరణలు చేయవచ్చు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన; 2015-2016/630

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!