RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495827

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకు లి. హైదరాబాద్ (తెలంగాణా) కు నిర్దేశాల జారీ

ఆగస్ట్ 31, 2016

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకు లి. హైదరాబాద్ (తెలంగాణా) కు నిర్దేశాల జారీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్, ప్రజలమేలుకై శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్‌కి కొన్ని నిర్దేశాలని జారీ చేయడం అవసరమని నిర్ణయించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35 A, సబ్ సెక్షన్‌ (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, మరియు సెక్షన్‌ 56, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, క్రింద శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, ఆగస్ట్ 29, 2016 పని ముగింపువేళ నుండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి పొందనిదే, ఈ క్రింద తెలిపిన మేరకు తప్ప-

అప్పులు, రుణాలు జారీ చేయరాదు మరియు నవీకరించరాదు: క్రొత్త పెట్టుబడులు పెట్టరాదు: అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపోజిట్లు అంగీకరించుటతో సహా, ఎటువంటి రుణభారము స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నెరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి, రాజీ, సర్దుబాటు ఒప్పందములు చేసుకొనరాదు; వారి ఆస్తులను, సంపత్తిని అమ్మరాదు, బదిలీ చేయరాదు - అని ఆదేశించింది.

  • పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, లేక ఏదేని పేరుతో పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి, డిపాజిటర్ కేవలం 1000/- మాత్రమే ఉపసంహరించుటకు అనుమతించవలెను. అయతే, డిపాజిటర్ ఏవిధంగానైనా బ్యాంకుకు రుణ పడి ఉంటే (అనగా రుణగ్రహీత/స్యూరిటీ) ఆ సొమ్ము మొదట రుణ ఖాతాలకు జమ చెయ్యాలి.

  • ప్రస్తుతం ఉన్న నిర్ణీతకాల డిపాజిట్లు అదే పేరుతో అదే హోదాలో, నవీకరించవచ్చు.

  • పై ఆదేశాల్లో అనుమతించిన మేరకు, వ్యయం చేయవచ్చు.

  • ప్రభుత్వ/SLRకు అమోదయోగ్యమైన సెక్యూరిటీలలో పెట్టుబడి చేయవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక అనుమతి లేనిదే ఏ ఇతర లయబిలిటీలు తీర్చరాదు.

పూర్తి ఆదేశాలు, ఆసక్తిగల ప్రజల సమాచారంకోసం, శ్రీ భారతి కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ వారి ఆవరణలో ప్రదర్శింపబడ్డాయి. పరిస్థితులకు అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్దేశాల్లో మార్పులు చేయవచ్చు.

ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినట్లు ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేవరకు, బ్యాంక్ కొన్ని నిబంధనలతో తమ కార్య కలాపాల్ని కొనసాగిస్తుంది. ఈ ఆదేశాలు, ఆగస్ట్ 29, 2016 పనివేళలు ముగింపునుంచి, ఆరు నెలలపాటు అమలులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన; 2016-2017/559

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?