<font face="mangal" size="3">ముంబైలోని ద కాపోల్ కోఆప‌రేటివ్ బ్యాంక్‌ కు ఆ - ఆర్బిఐ - Reserve Bank of India
ముంబైలోని ద కాపోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కు ఆదేశాలు జారీ చేసిన రిజర్వ్ బ్యాంక్
మార్చి 31, 2017 ముంబైలోని ద కాపోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కు ఆదేశాలు జారీ చేసిన రిజర్వ్ బ్యాంక్ భారత రిజర్వ్ బ్యాంక్ మార్చి 30, 2017న జారీ చేసిన (DCBS.CO.BSD-I/D-09/12.22.111/2016-17) ఆదేశాలను అనుసరించి, ముంబైలోని ద కాపోల్ కోఆపరేటివ్ బ్యాంక్ ను ఉత్తర్వుల క్రింద ఉంచడం జరిగింది. ఈ ఆదేశాలను అనుసరించి, డిపాజిట్ దారులు ప్రతి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ లేదా ఇతర ఏ డిపాజిట్ అకౌంట్ లోని మొత్తం నగదు నుండి, వాటిని ఏ పేరుతో పిలిచినప్పటికీ, అత్యధికంగా రూ.3,000 (మూడు వేల రూపాయలు) వరకు ఉపసంహరించుకొనేందుకు, RBI ఆదేశాలకు లోబడి, అనుమతించడం జరుగుతుంది. అంతే కాకుండా ద కాపోల్ కోఆపరేటివ్ బ్యాంక్, RBI మార్చి 30, 2017న జారీ చేసిన ఆదేశాలకు లోబడి, RBI యొక్క రాతపూర్వక ముందస్తు అనుమతి లేకుండా కొత్త రుణాలను మంజూరు చేయడం కానీ, రుణాలను లేదా అడ్వాన్సులను పునరుద్ధరించడం కానీ, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం కానీ, నిధుల సమీకరణ మరియు కొత్త డిపాజిట్లు స్వీకరించడం లాంటి వాటి ద్వారా పూచీకత్తు పడే విషయంలోను, పూచీకత్తుల చెల్లింపులలో భాగంగా నగదును చెల్లించడం లేదా చెల్లించేందుకు అంగీకరించడం, తన ఆస్తులను ఏదైనా ఒప్పందం కుదుర్చుకొని విక్రయించడం లేదా బదిలీ చేయడం లేదా ఇతర విధాలుగా విక్రయించడం కానీ చేయరాదు. ఈ ఆదేశాలు మార్చి 30, 2017న బ్యాంకు లావాదేవీలు ముగిసిన అనంతరం అమలులోకి వస్తాయి. ఈ ఆదేశాలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ ను రద్దు చేసినట్లుగా భావించరాదు. ఈ బ్యాంకు యొక్క ఆర్థిక స్థితి మెరుగు పడేంతవరకు పరిమితులకు లోబడి, బ్యాంకు తన లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. పరిస్థితులను బట్టి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఆదేశాలలో తగిన మార్పులు చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని సబ్ సెక్షన్స్ (1) మరియు (2) ఆఫ్ సెక్షన్ 35 A, రెడ్ విత్ సెక్షన్ 56 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఆదేశాలను జారీ చేసినది. ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం ఆ ఉత్తరువుల కాపీని బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-17/2631 |