<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, కరాడ్ జనతా సహకారి &# - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Karad Janata Sahakari Bank Ltd.) కరాడ్, సతారా జిల్లా, మహారాష్ట్ర కు నిర్దేశాల జారీ
నవంబర్ 09, 2017 భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Karad Janata Sahakari Bank Ltd.) కరాడ్, సతారా జిల్లా, మహారాష్ట్ర కు నిర్దేశాల జారీ కరాడ్, సతారా జిల్లా, మహారాష్ట్ర లోని ‘ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Karad Janata Sahakari Bank Ltd.)’ ను భారతీయ రిజర్వు బ్యాంక్ తమ ఆదేశాల (vide directive DCBS/CO.BSD-I/D-4/12.22.126/2017-18 తేదీ నవంబర్ 07, 2017) క్రిందకు తీసుకొచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం, డిపాజిటుదార్లు తమ పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా లేక ఏదేని పేరుతొ పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి కేవలం రూ.1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) ఉపసంహరించడానికి, ఆర్.బీ.ఐ. ఆదేశాల షరతులకు లోబడి, అనుమతించబడతారు. నవంబర్ 07, 2017 వ తేదీన నోటిఫై చేసిన ఆదేశాల ప్రకారం, ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Karad Janata Sahakari Bank Ltd.) వారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతిపొందనిదే, అప్పులు, రుణాలు ఇవ్వరాదు మరియు నవీకరించారాదు; కొత్త పెట్టుబడులు పెట్టరాదు; అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపాజిట్లు అంగీకరించడంతో సహా, ఎటువంటి రుణభారం స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నేరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి రాజీ, సర్దుబాటు ఒప్పందములు కుడుర్చుకోరాదు; వారి ఆస్తులను, సంపత్తులను అమ్మరాదు, బదిలీ గాని ఇంకే విధంగాగాని చేయరాదు. ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినట్లుగా ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్దిక పరిస్థితి మెరుగయ్యేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1), రెడ్ విత్ సెక్షన్ 56 నిబంధనల ప్రకారం సంక్రమించిన ఆధికారాలతో రిజర్వ్ బ్యాంకు చే ఈ ఆదేశాలు విధించబడ్డాయి. ఆదేశాల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1292. |