<font face="mangal" size="3">ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిట - ఆర్బిఐ - Reserve Bank of India
ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబాయి, మహారాష్ట్ర కు ఆర్బీఐ (RBI) నిర్దేశాల జారీ
అక్టోబర్ 29, 2018 ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబాయి, మహారాష్ట్ర కు ఆర్బీఐ (RBI) నిర్దేశాల జారీ ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబాయి, మహారాష్ట్ర ను భారతీయ రిజర్వు బ్యాంకు తమ నిర్దేశాల (అక్టోబర్ 26, 2018 తెదీ నాటి తమ నిర్దేశం నం. DCBS/CO.BSD-I/D-3/12.22.163/2018-19) క్రిందకు తీసుకువచ్చింది. ఈ నిర్దేశాల ప్రకారం, డిపాజిటుదార్లు తమ పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా లేక ఏదేని పేరుతొ పిలువబడే ఇతర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వనుంచి కేవలం ₹ 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) కు మించకుండా వాపసు తీసుకోవడానికి, ఆర్బీఐ నిర్దేశాలలోని షరతులకు లోబడి, అనుమతించబడతారు. అక్టోబర్ 26, 2018 వ తేదీన నోటిఫై చేసిన నిర్దేశాల ప్రకారం తప్ప, ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబాయి, మహారాష్ట్ర వారు భారతీయ రిజర్వు లిఖితపూర్వక అనుమతిపొందనిదే, లోన్స్ మరియు అడ్వాన్సులు కూడా ఇవ్వరాదు మరియు వీటిని నవీకరించరాదు; కొత్త పెట్టుబడులు పెట్టరాదు; అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపాజిట్లు అంగీకరించడంతో సహా, ఎటువంటి రుణభారం స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నేరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, చెల్లింపులు చేయడం, చెల్లింపుకై అంగీకరించడo చేయరాదు; ఎటువంటి రాజీ, సర్దుబాటు ఒప్పందములు కుడుర్చుకోరాదు; వారి ఆస్తులను, సంపత్తులను అమ్మరాదు, బదిలీ గాని ఇంకే విధంగాగాని వీటిని సర్దుబాటు చేయరాదు. ఈ నిర్దేశాలు అక్టోబర్ 29, 2018 తేదీ నాటి బ్యాంక్ బిజినెస్ ముగింపు నుండి ఆరు నెలలపాటు అమలులో ఉంటాయి. రిజర్వు బ్యాంకు చే నిర్దేశాల జారీ ని, స్వతహాగా బ్యాంక్ లైసెన్స్ ను రిజర్వు బ్యాంకు రద్దు చేసినట్లుగా ఎంతమాత్రం భావింపరాదు. బ్యాంక్ తన ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే వరకూ, నిబంధనలకు లోబడి, తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంకు తమ నిర్దేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ, సబ్-సెక్షన్ (1), రెడ్ విత్ సెక్షన్ 56 నిబంధనల ప్రకారం సంక్రమించిన ఆధికారాలతో రిజర్వు బ్యాంకు చే ఈ నిర్దేశాలు విధించబడ్డాయి. నిర్దేశాల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2018-2019/994 |