RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523559

శివాజీరావ్ భొసాలే సహకారి బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రకు,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు జారీ చేసినది

తేది: 06/05/2019

శివాజీరావ్ భొసాలే సహకారి బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రకు,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు జారీ చేసినది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మే 03, 2019 తేదీన జారీచేసిన వారి ఆదేశాలద్వారా, శివాజీరావ్ భొసాలే సహకారి బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రను సమగ్ర నిర్దేశాల పరిధిలోకి తెచ్చినది. ఈ నిర్దేశాలను అనుసరించి, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకులోబడి, ప్రతి సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతాలో (ఏ పేరుతో పిలవబడినా), గల నిల్వనుండి, రూ. 1,000/- (కేవలం ఒక వెయ్యి రూపాయిలు) మించకుండా ఒక్కసారి విత్‌డ్రా చేయుటకు మాత్రమే, బ్యాంక్ అనుమతించవచ్చు. ఇంతేగాక, శివాజీరావ్ భొసాలే సహకారి బ్యాంక్ లి., పుణే, రిజర్వ్ బ్యాంక్ మే 03, 2019 జారీ చేసిన నిర్దేశాలలో తెలిపినమేరకు తప్ప, వారి లిఖితపూర్వక అనుమతి లేనిదే, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులుతీసుకొనుట/ క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటవంటి రుణ భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని, ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు. ఈ నిర్దేశాలు మే 04, 2019 పనిముగింపు వేళనుండి, అమలులోకి వచ్చినవి.

పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు.

బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ చట్టం 1949, సబ్-సెక్షన్‌ (1) సెక్షన్‌ 35A క్రింద (సెక్షన్‌ 56 తో కలిపి), తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలను జారీ చేసింది. నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారం కోసం, శివాజీరావ్ భొసాలే సహకారి కో-ఆపరేటివ్ బ్యాంక్, ప్రాంగణంలో ప్రదర్శింపబడినది.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2609

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?