RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78475929

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, ది వైష్ కో-ఆప రేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ దిల్లీ, కు నిర్దేశాల జారీ

సెప్టెంబర్ 9, 2015

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, ది వైష్ కో-ఆప రేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ దిల్లీ, కు నిర్దేశాల జారీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్, ప్రజలకు నష్టం వాటిల్లకుండా వారించేదుకు, ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ దిల్లీ, కి కొన్ని నిర్దేశాలని జారీ చేయడం అవసరమని నిర్ణయించింది. తదనుసారంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35(A), సబ్ సెక్షన్‌ (1) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ద్వారా తమకు సంక్రమించిన అధికారాలతో, మరియు సెక్షన్‌ 56, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, క్రింద భారతీయ రిజర్వ్ బ్యాంక్, ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ దిల్లీ ని, సెప్టెంబర్ 8, 2015 పని ముగింపువేళ నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి లేనిదే, ఈ క్రింద సూచించిన మేరకు తప్ప - అప్పులు, ఋణాలు జారీ చేయరాదు మరియు నవీకరించరాదు; క్రొత్త పెట్టుబడులు పెట్టరాదు; అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపోజిట్లు అంగీకరించుటతో సహా, ఎటువంటి ఋణభారము స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నెరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, నగదు చెల్లించుట, చెల్లింపుకై అంగీకరించుట చేయరాదు; ఎటువంటి, రాజీ, సర్దుబాటు ఒప్పందములు చేసుకొనరాదు; వారి ఆస్తులను, సంపత్తులను అమ్మరాదు, బదిలీ చేయరాదు- అని అదేశించింది.

i. ప్రతి సేవింగ్స్ బ్యాంక్ , కరెంట్ అకౌంట్, డిపోజిట్ ఖాతా, వేరే ఏదేని పేరుతో పిలువబడే ఏ ఖాతాలోని మొత్తం నగదు నిల్వనుండి, 1000/- (అక్షరాలా వెయ్యి రూపాయిలు) వరకు మాత్రమే తీసుకోవడానికి బ్యాంక్ సమ్మతించాలి. అయితే, సదరు ఖాతాదారు బ్యాంకుకు రుణగ్రహీతగా, హామీదారుగా, లేక ఇంకేవిధంగా కానీ ఋణపడి ఉంటే, ఈ మొత్తం, ముందుగా ఈ రుణాల చెల్లింపుకై జమకట్టుకోవాలి. ప్రస్తుతంఉన్న టెర్మ్‌ డిపాజిట్లు, గడువు పూర్తి అయిన తర్వాత అదే పేరుతో, అదే హోదాతో నవీకరించవచ్చు.

iii. ఆదేశాల్లో అనుమతించిన మేరకు ఖర్చు చేయవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ యొక్క స్పష్టమైన లిఖితపూర్వక అనుమతి లేనిదే, ఏ ఇతర ఋణ భారము స్వీకరించరాదు, చెల్లు చేయరాదు.

బ్యాంకుకు జారీచేసిన సవిస్తరమైన ఆదేశాల ప్రతి, ఆసక్తిగల ప్రజల సమాచారంకోసం, వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., వారి ఆవరణలో ప్రదర్శింపబడింది. పరిస్థితుల్ని పరిశీలించి, రిజర్వ్ బ్యాంక్, ఈ నిర్దేశాల్లో సవరణలు చేయవచ్చు. ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినట్లు ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేవరకు, బ్యాంక్ కొన్ని నిబంధనలతో తమ కార్య కలాపాల్ని కొనసాగిస్తుంది.

ఈ నిర్దేశాలు, తిరిగి ప్రకటించేవరకు అమలులో ఉంటాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన; 2015-2016/626

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?