<font face="mangal" size="3px">న్యూఢిల్లీలో బ్యాంకింగ్ ఆంబుడ్స్‌ మెన్ ద్వ - ఆర్బిఐ - Reserve Bank of India
న్యూఢిల్లీలో బ్యాంకింగ్ ఆంబుడ్స్ మెన్ ద్వితీయ కార్యాలయాన్ని ప్రారంభించిన RBI
నవంబర్ 01, 2016 న్యూఢిల్లీలో బ్యాంకింగ్ ఆంబుడ్స్ మెన్ ద్వితీయ కార్యాలయాన్ని ప్రారంభించిన RBI ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ కార్యకలాపాలు గణనీయంగా పెరిగినందువల్ల మరియు న్యూఢిల్లీలోని ప్రస్తుత బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ కార్యాలయం అధికారపరిధి (jurisdiction) చాలా విస్తృతంగా ఉండడం వల్లను, భారతీయ రిజర్వ్ బ్యాంక్, న్యూఢిల్లీలో, బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ ద్వితీయ కార్యాలయాన్ని నెలకొల్పింది. న్యూఢిల్లీలోని మొదటి బ్యాంకింగ్ ఆంబుడ్స్ మెన్ కార్యాలయం ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్పై అధికారపరిధిని కలిగి ఉంటుంది. అదే విధంగా న్యూఢిల్లీలోని ద్వితీయ బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ కార్యాలయం హర్యానా (పంచకుల, యమునా నగర్, అంబాలా జిల్లాలు తప్ప మిగిలినవి) మరియు ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలపై అధికారపరిధిని కలిగి ఉంటుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-17/1079 |