<font face="Mangal" size="3">ఇంఫాల్ లో, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ ఉప-కార్యల&# - ఆర్బిఐ - Reserve Bank of India
ఇంఫాల్ లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉప-కార్యలయం ప్రారంభం
అక్టోబర్ 17, 2015 ఇంఫాల్ లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉప-కార్యలయం ప్రారంభం భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 17, 2015 న ఇంఫాల్ లో తమ ఉపకార్యాలయాన్ని ప్రారంభించింది. గౌరవనీయ, మణిపూర్ ముఖ్య మంత్రి శ్రీ ఓ. ఐబోబి సింగ్, మరియు శ్రీ హరూన్ ఆర్. ఖాన్, డిప్యూటీ గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపకార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. సంప్రదించుటకు, ఉపకార్యాలయ వివరాలు (contact details) ఈ క్రింద ఇవ్వబడ్డాయి: తపాలా చిరునామా: రిజర్వ్ బ్యాంక్ ఇంఫాల్ కార్యలయం, ఆర్థిక సమీకృత మరియు ఆభివృద్ధి విభాగం, వినియోగదారుల శిక్షణ/మరియు సంరక్షణ కక్ష, మార్కెట్ ఇంటెలిజన్స్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇంఫాల్ కార్యాలయం ప్రారంభం తో, ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో, ఐదింట రిజర్వ్ బ్యాంక్, కార్యాలయాలు కలిగి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్, ఇంఫాల్ లో కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ప్రశంసిస్తూ, ముఖ్య మంత్రి, ఇంతకు ముందు లేని ప్రాంతాల్లో వీలయినంత త్వరగా బ్యాంకులు ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి, రిజర్వ్ బ్యాంక్, NABARD. బ్యాంకులు, మరింత చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (RIDF) క్రింద, వరద నిరోధక చర్యలపై దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపారు. శ్రీ హరూన్ ఆర్. ఖాన్, డిప్యూటీ గవర్నర్, ఆర్థిక అభివృద్ధికై ఈశాన్య రాష్ట్రాల అవసరాలను రిజర్వ్ బ్యాంక్ అర్ధంచేసుకోగలదనీ. మణిపూర్ వంటి చిన్నరాష్ట్రం లో, ఇంఫాల్ లో కార్యాలయ ప్రారంభించడం, ఈ దిశగా ఒక అడుగు అని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ విధులు, కర్తవ్యాలను వివరిస్తూ, కొండ ప్రదేశాలను దృష్టిలో ఉంచుకొని, ఈశాన్య రాష్ట్రాలకై అనువైన చెల్లింపు విధానాల ఏర్పాటుకై రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తోందన్నారు. బ్యాంకింగ్ సౌకర్యాలు వృద్ధి చెందాలని చెబుతూ, వ్యవసాయం, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం (organic agriculture), తోటల పెంపకం, చేనేత వస్త్రాలు, చేతివృత్తులు, స్వయంసేవక సంఘాలు, ఉమ్మడి జవాబుదారీ సంఘాలు (joint liability groups), మరియు “Look East Policy ’ మొదలైనవాటి అభివృద్ధికి, ఎంతో ఆస్కారం ఉందని నొక్కి చెప్పారు. బ్యాంకులు, బ్యాంకుల ప్రతినిధుల (business correspondents) ద్వారా బ్యాంకింగ్ మెరుగుపరచడానికి, 'డిజిటల్ కనెక్టివిటీ' ఏంతో అవసరమన్నారు. శ్రీమతి దీపాలి పంత్ జోషీ, ఎక్జెక్యూటివ్ డైరెక్టర్, ఆర్ బి ఐ; శ్రీ ఒ. నబకిషోర్ సింగ్, చీఫ్ సెక్రటరీ, గవర్న్మెంట్ ఆఫ్ మణిపూర్, శ్రీ ఎస్ ఎస్ బారిక్, రీజనల్ డైరెక్టర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ/వాణిజ్య బ్యాంకుల/ రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ హౌజల్, ఆఫీసర్-ఇన్-చార్జ్, కృతజ్ఞతలు తెలియజేశారు. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన: 2015-2016/937 |