<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే డెహ్రాడున్‌లో బ్యాంకిం&# - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్చే డెహ్రాడున్లో బ్యాంకింగ్
ఆంబుడ్జ్మన్ కార్యాలయం ప్రారంభం
డిసెంబర్ 23, 2016 రిజర్వ్ బ్యాంక్చే డెహ్రాడున్లో బ్యాంకింగ్ ఇటీవలి కాలంలో గణనీయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరుగుట, ప్రస్తుత కాన్పూర్ బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ పరిధి అతిగా విస్తరించుట దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, డెహ్రాడున్లో బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ కార్యాలయం నెలకొల్పింది. పూర్తి ఉత్తరాఖండ్ రాష్ట్రం, ప్రస్తుతం బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ కార్యాలయం, కాన్పూర్ పరిధిలో ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఏడు జిల్లాలు, అనగా సహరాన్పూర్, షామ్లి (ప్రబుధ్ నగర్), ముజాఫర్నగర్, బాఘ్పట్, మీరట్, బిజ్నోర్, మరియు అమ్రోహ (జ్యోతిబా ఫూలె నగర్), ఇకపై బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ కార్యాలయం, డెహ్రాడున్ పరిధిలోకి వస్తాయి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2016-2017/1642 |