<font face="mangal" size="3px">అంబుడ్స్మన్ మూడవ కార్యాలయాన్ని న్యూ ఢిల్లĹ - ఆర్‌బిఐ - Reserve Bank of India
అంబుడ్స్మన్ మూడవ కార్యాలయాన్ని న్యూ ఢిల్లీ లో ఆర్‌బిఐ ప్రారంభించింది
తేది: 28/06/2019 అంబుడ్స్మన్ మూడవ కార్యాలయాన్ని న్యూ ఢిల్లీ లో ఆర్‌బిఐ ప్రారంభించింది డిసెంబర్ 5, 2018 నాటి ద్రవ్య విధాన ప్రకటనలో ప్రకటించినట్లుగా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్మన్ పథకాన్ని (ఓఎస్‌డిటి) జనవరి 31, 2019 న ప్రారంభించింది. భారతీయ రిజర్వు బ్యాంకు, న్యూ ఢిల్లీ వద్ద బ్యాంకింగ్ అంబుడ్స్మన్ (బిఓ) మూడవ కార్యాలయాన్ని మరియు డిజిటల్ లావాదేవీల కొరకు అంబుడ్స్మన్ (ఒడిటి) కార్యాలయాన్ని (న్యూ ఢిల్లీ-III) బ్యాంకింగ్ అంబుడ్స్మన్ పథకం మరియు ఓఎస్‌డిటి క్రింద పరిష్కారాల కోసం పెరుగుతున్న అవసరాల కొరకు ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం జూలై 1, 2019 నుండి అమలులోకి వస్తుంది జూలై 1, 2019 నుండి అమలులోకి వచ్చే బిఓ మరియు ఒడిటి, న్యూ ఢిల్లీ I, II మరియు III యొక్క ప్రాదేశిక అధికార పరిధి మరియు ఇ-మెయిల్ ఐడిలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
ఏప్రిల్ 26, 2019 నాటి పత్రికా ప్రకటనలో ప్రకటించినట్లుగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కోసం అంబుడ్స్మన్ పథకం క్రింద ప్రాదేశిక అధికార పరిధి మారదు. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2018-2019/3085 |