<font face="mangal" size="3">బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్క - ఆర్బిఐ - Reserve Bank of India
బెడ్కిహల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్కిహల్, కర్నాటకపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.
తేదీ : 20/02/2018 బెడ్కిహల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్కిహల్, కర్నాటకపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47(A) 1 (c) (సెక్షన్ 46 (4) తో కలిపి) క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బెడ్కిహల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లి., బెడ్కిహల్, కర్నాటకపై, ₹ 1,00,000 (రూపాయిలు ఒక లక్ష) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందున, ఈ జరిమానా విధించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్, బెడ్కిహల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి జవాబుగా బ్యాంక్, ప్రత్యక్ష సమావేశం కోరినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు, మౌఖిక వినతులు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2239 |