<font face="mangal" size="3px">ఆర్బీఐ పునరుద్ఘాటన - వివిధ డిజైన్లతో కూడిన <span sty - ఆర్బిఐ - Reserve Bank of India
ఆర్బీఐ పునరుద్ఘాటన - వివిధ డిజైన్లతో కూడిన ₹ 10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు (లీగల్ టెండర్) అవుతాయి
జనవరి 17, 2018 ఆర్బీఐ పునరుద్ఘాటన - వివిధ డిజైన్లతో కూడిన ₹ 10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు (లీగల్ టెండర్) అవుతాయి చెల్లుబాటు కావనే అపోహతో కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యాపారులు మరియు ప్రజలు, ₹ 10 నాణేలు తీసుకోవడం లేదన్న విషయం రిజర్వు బ్యాంక్ వారి దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ముద్రణా సంస్థలు (మింట్‌లు) ముద్రించిన నాణేలను (కాయిన్లు) రిజర్వు బ్యాంక్ చెలామణిలోకి తెచ్చిందని స్పష్టంచేస్తున్నాము. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో విలక్షమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ నాణేలను, ఎప్పటికప్పుడు చలామణిలోకి తీసుకురావడం జరిగింది. నాణేలు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటం మూలాన, ఒకే సమయంలో వివిధ డిజైన్లలో మరియు ఆకృతిలలో ఈ నాణేలు మార్కెట్లో చట్టబద్ధంగా చలామణీలో ఉన్నాయి. ఇప్పటివరకు, రిజర్వ్ బ్యాంకు ఈ ₹ 10 నాణేలను 14 రకాల డిజైన్లతో జారీ చేసింది మరియు ప్రజలకు ఈ నాణేల విలక్షమైన ఫీచర్లను పత్రికా ప్రకటనల (జాబితా అనుబంధం చేయబడింది) ద్వారా తెలియజేయటం జరిగింది. ఈ నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయి మరియు లావాదేవీల సందర్భంగా వీటిని అంగీకరించాలి. ఇంతకుముందు కూడా రిజర్వ్ బ్యాంకు నవంబర్ 20, 2016 తారీఖు నాటి తమ పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు ₹ 10 నాణేలపై అనుమానం అవసరంలేదని, విభిన్న రకాల డిజైన్లతో కూడిన ఈ నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని మరియు వారి లావాదేవీల కోసం ఈ నాణేలను అంగీకరించాలని స్పష్టం చేశారు. బ్యాంకుల బ్రాంచిలన్నింటిలోనూ ఈ నాణేలను లావాదేవీలు మరియు ఎక్స్ఛేంజ్ కోసం అంగీకరించాలని, రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు కూడా సలహా ఇచ్చింది. ఈ నాణేల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఈ క్రింది లింక్ ను సందర్శించండి: /en/web/rbi/press-releases
జోస్ జె.కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1950 |