<font face="Mangal" size="3">ఆర్బిఐ ‘స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం _ వాలంటరీ  - ఆర్బిఐ - Reserve Bank of India
ఆర్బిఐ ‘స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం _ వాలంటరీ రిటెన్షన్ రూట్ (VRR)’ లో యఫ్.పి.ఐల పెట్టుబడి కోసం చర్చా పేజీ ని (డిస్కషన్ పేపర్) విడుదల చేసింది
అక్టోబర్ 05, 2018 ఆర్బిఐ ‘స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం _ వాలంటరీ రిటెన్షన్ రూట్ (VRR)’ లో యఫ్.పి.ఐల పెట్టుబడి కోసం భారతీయ రిజర్వు బ్యాంకు నేటి రోజున ‘స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం _ వాలంటరీ రిటెన్షన్ రూట్ (VRR)’ లో యఫ్.పి.ఐల పెట్టుబడి కోసం వొక చర్చా పేజీని (డిస్కషన్ పేపర్) విడుదల చేసింది. మార్కెట్ భాగస్వాములు మరియు ఆసక్తి గల ఇతర పార్టీలు చర్చా పేజీపై తమ వ్యాఖ్యలను అక్టోబర్ 19, 2018 నాటికి పంపించాలి. చర్చా పేజీ పై (డిస్కషన్ పేపర్) అభిప్రాయాన్ని – ది చీఫ్ జనరల్ మేనేజర్, భారతీయ రిజర్వు బ్యాంకు, ఫైనాన్షియల్ మార్కెట్ల నియంత్రణ విభాగం, మొదటి అంతస్తు, మెయిన్ బిల్డింగ్, షహీద్ భగత్ సింగ్ మార్గ్, ఫోర్ట్, ముంబాయి – 400001 నకు గాని లేదా ‘ఫీడ్- బ్యాక్ ఆన్ డిస్కషన్ పేపర్’ ప్రధాన సబ్జెక్టు లైన్ తో ఈ-మెయిలు ద్వారా గాని పంపించవచ్చు. నేపథ్యం భారతీయ రిజర్వు బ్యాంకు తన - ‘అభివృద్ధి, నియంత్రణ విధానాలపై నివేదిక, నాల్గవ ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన, అక్టోబర్ 05, 2018’ నందు పబ్లిక్ సంప్రదింపుల కోసం ‘స్వచ్ఛంద ప్రతిధారణ మార్గం _ వాలంటరీ రిటెన్షన్ రూట్ (VRR)’ లో యఫ్.పి.ఐల పెట్టుబడి కై చర్చా పేజీ ని (డిస్కషన్ పేపర్) విడుదలచేస్తానని ప్రకటించింది. తదనుగుణంగా, అభిప్రాయసేకరణ కై ఈ డిస్కషన్ పేపర్ జారీ చేయబడుతోంది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/806 |