<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ పథకij - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ పథకం
నవంబర్ 12, 2021 భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ పథకం భారతీయ రిజర్వ్ బ్యాంక్ నేటినుండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ పథకం ప్రారంభించింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి, వర్చువల్ విధానంలో ఈ పథకానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ వృద్ధిచేసే దిశలో ఇదొక మైలు రాయి. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా-రిటైల్ డైరెక్ట్ (ఆర్ బి ఐ-ఆర్ డి స్కీమ్), ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి చేసే విధానాన్ని సరళతరంచేయడం ద్వారా, సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసికొని వస్తుంది. రిటైల్ మదుపరులు ఆన్ లైన్ పోర్టల్ (https://rbiretaildirect.org.in) వినియోగించి, రిజర్వ్ బ్యాంకులో ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ (ఆర్ డి జి) ఖాతా తెరవవచ్చు. ఈ క్రింది మార్గాలలో పెట్టుబడి చేయవచ్చు: a) ప్రభుత్వ సెక్యూరిటీల ప్రాథమిక జారీ: నాన్- కాంపెటిటివ్ పథకం క్రింద, ప్రభుత్వ సెక్యూరిటీల ప్రాథమిక వేలంలో ‘బిడ్’ చేయవచ్చు (ఎస్ జి బి జారీకి వర్తించే మార్గదర్శకాలు పాటించాలి). b) సెకండరీ మార్కెట్: మదుపరులు, ఎన్ డి ఎస్ – ఓ ఎమ్ ద్వారా, ప్రభుత్వ సెక్యూరిటీలు కొనవచ్చు మరియు అమ్మవచ్చు (‘ఆడ్ లాట్’ మరియు ‘రిక్వెస్ట్ ఫర్ కోట్స్’ విభాగాలలో). పొదుపు ఖాతానుండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేక ఏకీకృత చెల్లింపు మాధ్యమం (యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్) ద్వారా సొమ్ము చెల్లించవచ్చు. మదుపరులకు అవసరమైన సహాయం, ‘పోర్టల్’లో మరియు రుసుములేని టెలిఫోన్ నంబర్ 1800-267-7955 ద్వారా (ఉదయం 10 నుండి సాయంత్రం 7 గం. వరకు) మరియు ఈ-మెయిల్ ద్వారా లభిస్తుంది. మదుపరులకు, లావాదేవీల / నిల్వ నివేదికలు, నామినేషన్ సదుపాయం, సెక్యూరిటీల తాకట్టు / ధరావతు అధికారం (ప్లెడ్జ్ / లీన్) మరియు కానుకలకు సంబంధించిన సేవలుకూడా కల్పించబడతాయి. పథకం క్రింద కల్పించిన సేవలకు ఎలాంటి రుసుము వసూలు చేయబడదు. మదుపరులకు భద్రమైన, సరళమైన, సురక్షితమైన వేదిక కల్పించడమే, ఈపథకంయొక్క లక్ష్యం. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/1183 |