<font face="mangal" size="3">పర్యవేక్షణా సహకారం, పర్యవేక్షణ సమాచార మార్ప - ఆర్బిఐ - Reserve Bank of India
పర్యవేక్షణా సహకారం, పర్యవేక్షణ సమాచార మార్పిడిపై బ్యాంక్ ఆఫ్ గయానాతో అవగాహన
ఒప్పందం (Memorandum of Understanding, MoU) సంతకం చేసిన రిజర్వ్ బ్యాంక్
ఏప్రిల్ 20, 2017 పర్యవేక్షణా సహకారం, పర్యవేక్షణ సమాచార మార్పిడిపై బ్యాంక్ ఆఫ్ గయానాతో అవగాహన భారతీయ రిజర్వ్ బ్యాంక్, పర్యవేక్షణా సహకారం మరియు పర్యవేక్షణా సమాచార బదిలీపై (Supervisory Co-operation and Exchange of Supervisory Information), బ్యాంక్ ఆఫ్ గయానాతో అవగాహనా ఒప్పందం (MoU) సంతకం చేసింది. ఈ ఒప్పందంమీద, బ్యాంక్ ఆఫ్ గయానా తరఫున, గవర్నర్ డా. గోబింద్ ఎన్ గంగా; భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరఫున, గవర్నర్ డా. ఉర్జిత్ ఆర్. పటేల్ సంతకాలు చేశారు. పర్యవేక్షణలో సహకారం మరియు పర్యవేక్షణా సమాచార మార్పిడి మరింత మెరుగుపరచడం కోసం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని దేశాల పర్యవేక్షకులతో, అవగాహనా ఒప్పందాలు (MoU), పర్యవేక్షణా సహకార పత్రం (Letter for Supervisory Co-operation), సహకార ప్రతిపాదన (Statement of Co-operation) ఒప్పందాలు కుదుర్చుకొంది. ఈ MoU తో కలిపి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటువంటి MoU లు 40, ఒక పర్యవేక్షణా సహకార పత్రం, ఒక సహకార ప్రతిపాదనపై సంతకాలు చేసింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2842 |