‘‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ సమాచార మార్పిడి’’ పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియాతో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఆర్‌బీఐ
మార్చి 22, 2017 ‘‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ సమాచార మార్పిడి’’ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘‘సూపర్ వైజరీ సహకారం మరియు సూపర్ వైజరీ సమాచార మార్పిడి’’ పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియాతో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ అవగాహనా ఒప్పందంపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా తరపున గవర్నర్ శ్రీ గాడ్విన్ ఎమెఫీల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్. పటేల్‌లు సంతకాలు చేశారు. సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి మరియు సూపర్ వైజరీ సమాచారాన్ని పంచుకొనేందకు రిజర్వ్ బ్యాంక్ పలు దేశాలతో అవగాహనా ఒప్పందాలు, సూపర్ వైజరీ సహకార లేఖలు మరియు సూపర్ వైజర్ల సహకార ప్రకటనలపై పలు ఒప్పందాలు కుదుర్చుకొన్నది. దీంతో ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి 37 అవగాహనా ఒప్పందాలు, ఒక సూపర్ వైజరీ సహకార లేఖ మరియు ఒక సహకార ప్రకటనలపై సంతకాలు చేసినట్లయింది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2527 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: