<font face="mangal" size="3">సూపర్వైజరీ కో-ఆపరేషన్‌ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ - ఆర్బిఐ - Reserve Bank of India
సూపర్వైజరీ కో-ఆపరేషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ సూపర్వైజరీ ఇన్ఫర్మేషన్పై (Supervisory Cooperation and Exchange of Supervisory Information) నేషనల్ బ్యాంక్ అఫ్ కంబోడియాతో (National Bank of Cambodia) అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేసిన రిజర్వ్ బ్య&
జులై 01, 2016 సూపర్వైజరీ కో-ఆపరేషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ సూపర్వైజరీ ఇన్ఫర్మేషన్పై (Supervisory Cooperation and Exchange of Supervisory Information) నేషనల్ బ్యాంక్ అఫ్ కంబోడియాతో (National Bank of Cambodia) అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూపర్వైజరీ కో-ఆపరేషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ సూపర్వైజరీ ఇన్ఫర్మేషన్పై (Supervisory Cooperation and Exchange of Supervisory Information) నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియాతో ఒక అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేసింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా తరఫున, ఎచ్.ఇ కిమ్ వాదా (H.E Kim Vada) డైరెక్టర్ జనరల్, బ్యాంకింగ్ పర్యవేక్షణ (Director General of Banking Supervision); భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరఫున శ్రీమతి మీనా హేమ్చంద్ర, కార్యపాలక నిర్దేశకులు (Executive Director), ఈ MoU పై సంతకంచేశారు. పర్యవేక్షణ పై మరింత సమాచారం పంచుకొనేందుకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, కొన్ని దేశాల బ్యాంకింగ్ పర్యవేక్షకులతో - MoU, లెటర్ ఆఫ్ సూపర్వైజరీ కో-ఆపరేషన్, మరియు స్టేట్మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ కుదుర్చుకొంది. ఇప్పుడు సంతకంచేసిన MoU తో కలిపి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొత్తం 33 MoU లు, ఒక లెటర్ ఆఫ్ సూపర్వైజరీ కో-ఆపరేషన్, ఒక స్టేట్మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ సంతకం చేసింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/15 |