RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500037

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ మ‌య‌న్మార్ తో ‘సూప‌ర్ వైజ‌రీ స‌హ‌కారం మ‌రియు సూప‌ర్ వైజ‌రీ స‌మాచార మార్పిడి’ పై MoUపై సంత‌కాలు చేసిన RBI

అక్టోబ‌ర్ 21, 2016

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ మ‌య‌న్మార్ తో ‘సూప‌ర్ వైజ‌రీ స‌హ‌కారం మ‌రియు సూప‌ర్ వైజ‌రీ
స‌మాచార మార్పిడి’ పై MoUపై సంత‌కాలు చేసిన RBI

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ రిపబ్లిక్ యూనియ‌న్ ఆఫ్ మ‌య‌న్మార్ కు చెందిన సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ మ‌య‌న్మార్ తో అక్టోబ‌ర్ 19, 2016న ఒక మెమోరాండం ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్ (MoU)పై సంత‌కాలు చేసింది. గౌర‌వ‌నీయులు భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోడీ మ‌రియు మ‌య‌న్మార్ స్టేట్ కౌన్సెల‌ర్ H.E. అంగ్ సాన్ సూకీ స‌మ‌క్షంలో జ‌రిగిన‌ ఈ MoUపై సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ మ‌య‌న్మార్ త‌ర‌పున మ‌య‌న్మార్ ప్ర‌భుత్వానికి చెందిన స‌హాయ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ యూ క్యా తిన్ సంత‌కాలు చేయ‌గా, భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ త‌ర‌పున డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఎస్ ఎస్ ముంద్రా సంత‌కాలు చేశారు.

దేశాల మ‌ధ్య‌ మ‌రింత స‌హ‌కారాన్ని పెంపొందించేందుకు, సూప‌ర్ వైజ‌రీ స‌మాచారాన్ని పంచుకునేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ కొన్ని దేశాల‌కు చెందిన సూప‌ర్ వైజ‌ర్ల‌తో మెమోరాండం ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్, లెట‌ర్ ఫ‌ర్ సూప‌ర్ వైజ‌రీ కో-ఆప‌రేష‌న్ మ‌రియు స్టేట్ మెంట్ ఆఫ్ కో-ఆప‌రేష‌న్ ఒప్పందాలు చేసుకొంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ అలాంటి 34 MoUలు, ఒక లెట‌ర్ ఫ‌ర్ సూప‌ర్ వైజ‌రీ కో-ఆప‌రేష‌న్ మ‌రియు ఒక స్టేట్ మెంట్ ఆఫ్ కో-ఆప‌రేష‌న్ పై సంత‌కాలు చేసింది.

అల్ప‌నా కిల్లావాలా
ప్ర‌ధాన స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-2017/995

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?