<font face="Mangal" size="3"> రిజర్వ్ బ్యాంక్ చే ‘L’ అక్షరం పొందుపరచిన (inset) <span style="fon - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ చే ‘L’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 1000 బ్యాంక్ నోట్ల జారీ
నవంబర్ 16, 2015 రిజర్వ్ బ్యాంక్ చే ‘L’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 1000 బ్యాంక్ నోట్ల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో 'L’ అక్షరం పొందుపరచిన ₹ 1000 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డా. రఘురామ్ జి రాజన్ సంతకం కలిగి ఉంటాయి. బ్యాంక్ నోట్ వెనుక, '2015' అని ముద్రించి ఉంటుంది. జారీ చేయబోయే ఈ నోట్ల నమూనా, అన్నివిధాలా, అనగా, నంబర్ ప్యానెళ్ళలో ఎడమనుండి, కుడికి పెరుగుతున్న అంకెల పరిమాణం, అంచుల చివర ఏటవాలు గీతలు (bleed lines), పెద్దవిగా చేసిన గుర్తింపు చిహ్నాలతో సహా, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, గతంలో జారీ చేసిన ₹ 1000 బ్యాంక్ నోట్లను పోలి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన నోట్లు మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2015 లో జారీ చేయబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్, ఇంతవరకు జారీ చేసిన ₹ 1000 విలువ గల అన్ని బ్యాంక్ నోట్లూ, చట్టబద్ధంగా చెలామణి లో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2015-2016/1158 |