<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే " R" అక్షరం నిగూఢంగా కలిగి - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్చే " R" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 1000 విలువగల బ్యాంకు నోట్లు జారీ
మే 09, 2016 రిజర్వ్ బ్యాంక్చే " R" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 1000 విలువగల బ్యాంకు నోట్లు జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్-2005 క్రింద రెండు నంబర్ ప్యానెళ్ళలో "R” అక్షరం నిగూఢంగా కలిగిన ₹ 1000 విలువగల బ్యాంక్ నోట్లు జారీ చేయనుంది. బ్యాంక్ నోట్లు, ముందువైపు, మిగిలిన అన్ని భద్రతా అంశాలు - ఆరోహణక్రమంలో సంఖ్యలు, బ్లీడ్ లైన్స్, పెద్దదిగా ఉన్న గుర్తింపు చిహ్నం ఇంకా డా. రఘురామ్ రాజన్, గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క సంతకం కలిగి ఉంటాయి. ముద్రించిన సంవత్సరం "2016" నోటు వెనుకవైపు ముద్రించబడి ఉంటుంది. ఈనోట్ల నమూనా, అన్ని రకాలుగా, మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద పూర్వం జారీ చేసిన ₹ 1000 నోట్ల వలెనే ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆరోహణక్రమంలో సంఖ్యలు కలిగి, బ్లీడ్ లైన్స్, పెద్ద గుర్తింపు చిహ్నంలేకుండా జారీ చేసిన ₹ 1000 బ్యాంక్ నోట్లతోసహా, ఇంతకు పూర్వం జారీ చేసిన అన్ని ₹ 1000 బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2015-2016/2611 |