<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే " L" అక్షరం నిగూఢంగా కలిగి - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్చే " L" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 10 విలువగల నోట్లు జారీ
ఏప్రిల్ 13, 2016 రిజర్వ్ బ్యాంక్చే " L" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 10 విలువగల నోట్లు జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్-2005 క్రింద "L” అక్షరం నిగూఢంగా ఉండి, డా. రఘురామ్ రాజన్, గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్చే సంతకం చేయబడ్డ ₹ 10 విలువగల బ్యాంక్ నోట్లు జారీ చేస్తుంది. ముద్రించిన సంవత్సరం "2016" నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది. ఈనోట్ల నమూనా, రెండు నంబర్ ప్యానెళ్ళలో ఉన్న సంఖ్యలు – మొదటి మూడు అక్షర-సంఖ్యలు (ప్రిఫిక్స్) ఒకే పరిమాణంలో ఉండి, మిగిలిన సంఖ్యలు ఎడమనుంచి కుడికి ఆరోహణ క్రమంలో పెరగడం తప్ప, మిగిలిన అన్ని విధాలుగా, పూర్వం మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద జారీ చేసిన ₹ 10 నోట్ల వలెనే ఉంటుంది. ![]() నంబర్ ప్యానెళ్ళలో సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్న, ₹ 50, ₹ 100, ₹ 500, ₹ 1000 విలువగల బ్యాంక్ నోట్లు, ఇంతకు ముందే జారీ చేయబడ్డాయి. ఇంతకు ముందు జారీ చేసిన అన్ని ₹ 10 విలువగల నోట్లూ, చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2015-2016/2413 |