<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్ త్వరలో స్వామి చిన్మయానంద శత - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ త్వరలో స్వామి చిన్మయానంద శతజయంతి పురస్కరించుకొని, ₹ 10 నాణేలు చెలామణిలోకి తేబోతున్నది.
జూన్ 22, 2016 రిజర్వ్ బ్యాంక్ త్వరలో స్వామి చిన్మయానంద శతజయంతి పురస్కరించుకొని, భారతీయ రిజర్వ్ బ్యాంక్, స్వామి చిన్మయానంద శతజయంతి స్మారకార్థం భారత ప్రభుత్వంచే ముద్రించబడిన ₹ 10 నాణేలు, త్వరలో చెలామణిలోకి తేనున్నది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగం, ది గజెట్ ఆఫ్ ఇండియా – ఎక్స్‌ట్రా ఆర్డినరీ – పార్ట్ I - సెక్షన్ I- సెక్షన్ (1)- నం. 274, ఏప్రిల్ 30, 2015 (The Gazette of India –Extraordinary –Part I-Section I- Section (1)- No.274 dated April 30, 2015) ప్రచురించిన విధంగా, ఈనాణేల నమూనా వివరాలు, ఈ క్రింది విధంగా ఉంటాయి: ముందువైపు అశోక స్తంభం లోని సింహ శిఖరం, మధ్యలో ముద్రించబడి ఉంటుంది దీనిక్రింద “सत्यमेव जयते” అని వ్యాఖ్య లిఖించబడి ఉంటుంది. ఎడమ అంచులో "भारत" అన్న పదం దేవనాగరిలో, కుడిఅంచులో "INDIA” అన్న పదం ఇంగ్లీష్‌లో, ముద్రించి ఉంటాయి. సింహ శిఖరం క్రింద, రూపాయి చిహ్నం "₹", నాణెం విలువ "10" అంతర్జాతీయ సంఖ్యల్లో కలిగి ఉంటుంది. వెనుకవైపు నాణెం మధ్యలో స్వామి చిన్మయానంద యొక్క చిత్రం అచ్చువేయబడి ఉంటుంది. పై అంచున “स्वामी चिन्मयानंद की जन्म शती” అని దేవనాగరిలో, క్రింది అంచున "Birth Centenary of Swami Chinmayananda” అని ఇంగ్లీష్‌లో, ముద్రించబడి ఉంటుంది. సంవత్సరం “2015”, అంతర్జాతీయ సంఖ్యల్లో, చిత్రం క్రింద ముద్రించబడి ఉంటుంది. ఈ నాణేలు కాయినేజ్ ఏక్ట్ 2011 (The Coinage Act, 2011) క్రింద, చట్టబద్ధంగా చెలామణిలో అవుతాయి. ప్రస్తుతం ఉన్న, ఈ విలువగల నాణేలుకూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. అజిత్ప్రసాద్ పత్రికా ప్రకటన: 2015-2016/2974 |