లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ
అక్టోబర్ 12, 2015 లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు జారీ చేసిన సమగ్ర ఆదేశాలను, రిజర్వ్ బ్యాంక్, అక్టోబర్ 12, 2015, పనివేళల ముగింపు సమయం నుండి, ఉపసంహరించింది. రిజర్వ్ బ్యాంక్, సబ్ సెక్షన్ (2), సెక్షన్ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార బ్యాంకులకు వర్తించేమేరకు) ద్వారా, తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ ఆదేశాలు ఉపసంహరించింది. ఈ ఉత్తరువుల ప్రతి, ప్రజల సమాచారం కోసం, లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ వారి ఆవరణలో ప్రదర్శించబడింది. బ్యాంక్, ఇకపై యథావిధిగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. సంగీతా దాస్ పత్రికా ప్రకటన: 2015-2016/886 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: