<font face="mangal" size="3">ప్ర‌స్తుత రూ.500 మ‌రియు రూ.1000 బ్యాంకు నోట్ల చ‌ట్ట&zwnj - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - విత్ డ్రా చేసుకునే సొమ్ముపై పరిమితి
RBI/2016-17/124 నవంబర్ 11, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - విత్ డ్రా చేసుకునే సొమ్ముపై పరిమితి దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 10, 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం.DCM (Plg) No.1251/10.27.00/2016-17 ను గమనించి, వాటికి సంబంధించిన ఈ క్రింది అదనపు సూచనలను గమనించగలరు: 2. అసాధారణ సందర్భాలలో ప్రభుత్వ విభాగాలు తమ నగదు అవసరాల గురించి బ్యాంకు అధికారులకు సాక్ష్యాధారాలతో వ్రాతపూర్వకంగా తెలియజేసి, జనరల్ మేనేజర్ లేదా ఆయనకు పైనున్న అధికారుల విచక్షణాధికారాలను అనుసరించి, నిర్ధారిత పరిమితి రూ.10,000 కు మించి నగదును డ్రా చేసుకోవచ్చు. మీ విశ్వసనీయులు, (పి.విజయ కుమార్) |