<font face="mangal" size="3">వివిధ చెల్లింపు అవసరాల కొరకు అనుపాలన కాలవ్ķ - ఆర్‌బిఐ - Reserve Bank of India
వివిధ చెల్లింపు అవసరాల కొరకు అనుపాలన కాలవ్యవధిలో సడలింపు
ఆర్‌బిఐ/2021-22/41 మే 21, 2021 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడం/డియర్ సర్ వివిధ చెల్లింపు అవసరాల కొరకు అనుపాలన కాలవ్యవధిలో సడలింపు భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన క్రింది ఆదేశాలపై బ్యాంకుల దృష్టి కోరడమైనది – (ఎ) ముందు చెల్లింపు సాధనాల జారీ మరియు కార్యకలాపాలపై (పిపిఐ-ఎండి) అక్టోబర్ 11, 2017 నాటి DPSS.CO.PD.No.1164/02.14.006/2017-18 (ఎప్పటికప్పుడు నవీకరించబడినట్లు) మాస్టర్ డైరెక్షన్; (బి) అధీకృత చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించి విఫలమైన లావాదేవీల కోసం హార్మోనైజేషన్ ఆన్ టర్న్ ఎరౌండ్ టైమ్ (టాట్) మరియు సేవాదారుని పరిహారంపై సెప్టెంబర్ 20, 2019 నాటి DPSS.CO.PD.No.629/ 02.01.014/2019-20; (సి) చెల్లింపు వ్యవస్థల యొక్క సిస్టమ్ ఆడిట్ యొక్క పరిధి మరియు కవరేజ్ పై జనవరి 10, 2020 నాటి DPSS.CO.OD.No.1325/ 06.11.001/2019-20; (డి) చెల్లింపు అగ్రిగేటర్స్ (పిఏ) మరియు చెల్లింపు గేట్‌వేల (పిజి) నియంత్రణ మార్గదర్శకాలపై మార్చి 17, 2020 నాటి DPSS.CO.PD.No.1810/02.14.008/2019-20 మరియు; (ఇ) వివిధ చెల్లింపు వ్యవస్థ అవసరాల కొరకు అనుపాలన కాలవ్యవధిలో పొడిగింపుపై జూన్ 4, 2020 నాటి DPSS.CO.PD.No.1897/02.14.003/2019-20. 2. COVID-19 మహమ్మారి యొక్క పునరుత్థానం మరియు వివిధ బ్యాంక్ మరియు నాన్-బ్యాంక్ సంస్థల నుండి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, అనుబంధంలో వివరించిన కొన్ని ప్రాంతాలకు సంబంధించి అనుపాలన కోసం సూచించిన కాలవ్యవధిని పొడిగించాలని నిర్ణయించడమైనది. 3. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 (చట్టం 51 ఆఫ్ 2007) లోని సెక్షన్ 18 తో సెక్షన్ 10 (2) క్రింద ఈ ఆదేశం జారీ చేయబడింది. మీ విధేయులు (పి. వాసుదేవన్) మే 21, 2021 నాటి ఆర్‌బిఐ సర్క్యులర్ CO.DPSS.POLC.No.S-106/02-14-003/2021-2022 కు అనుబంధం
|