<font face="mangal" size="3">కోవిడ్-19 సంబంధిత ఒత్తిడి ఉపశమన చట్రం (‘రిజల్య&# - ఆర్బిఐ - Reserve Bank of India
కోవిడ్-19 సంబంధిత ఒత్తిడి ఉపశమన చట్రం (‘రిజల్యూషన్ ఫ్రేమ్ వర్క్’) గురించి నిపుణుల కమిటీ నివేదిక
సెప్టెంబర్ 07, 2020 కోవిడ్-19 సంబంధిత ఒత్తిడి ఉపశమన చట్రం (‘రిజల్యూషన్ ‘కోవిడ్-19 సంబంధిత వత్తిడి నుంచి ఆర్ధిక ఉపశమనం కోసం ఏయే అంశాలను ఉపశమన చట్రం క్రింద పరిగణనలోకి తీసుకోవాలో, నిర్దిష్ట రంగానికి సంబంధిత ప్రామాణికాలశ్రేణి తో కూడిన అవసరమైన ఆర్ధిక పరామితులను సిఫార్సు చేయడానికి, భారతీయ రిజర్వు బ్యాంకు శ్రీ కె వి కామత్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ ని ఆగస్టు 7, 2020న ప్రకటించింది. ఈ కమిటీ సెప్టెంబర్ 04, 2020 న భారతీయ రిజర్వు బ్యాంకుకు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆర్బీఐ వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. పరపతి, ద్రవ్యత మరియు రుణ సేవా సామర్థ్యానికి సంబంధించిన అంశాలను మిగతా విషయాలతోపాటు కలిపి, ఆర్థిక పరామితులను కమిటీ సిఫారసు చేసింది. రుణగ్రహీత కోసం ఉపశమన ప్రణాళికను ఖరారు చేసేటప్పుడు, రుణాలు ఇచ్చే సంస్థల ద్వారా 26 రంగాలకు గమనించవలసిన ఆర్థిక నిష్పత్తులను కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సులను భారతీయ రిజర్వు బ్యాంకు చాలావరకు అంగీకరించింది. దీని ప్రకారం, ఆగస్టు 06, 2020 లో ప్రకటించిన ఉపశమన ప్రణాళిక (రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్) మార్గదర్శకాలకు ఐదు నిర్దిష్ట ఆర్థిక నిష్పత్తులను మరియు 26 రంగాలకు సంబంధించి ప్రతి నిష్పత్తికి ఆయా రంగం కు నిర్దిష్ట పరిమితులను పేర్కొంటూ సంబంధిత తదనంతర చర్యల (ఫాలో అప్) సర్క్యులర్ ను, భారతీయ రిజర్వు బ్యాంకు ఈ రోజు జారీ చేసింది. ఉపశమన ప్రణాళిక (రిజల్యూషన్ ప్రణాళిక) లను ఖరారు చేస్తున్నప్పుడు, నిష్పత్తులు కొన్ని పేర్కొనబడని ఇతర రంగాలకు సంబంధించిన విషయాల కోసం ఆగస్టు 06, 2020 నాటి సర్క్యులర్ యొక్క సమోన్నత భావాన్ని మరియు ఈ రోజు జారీ చేసిన తదనంతర చర్యల (ఫాలో అప్) సర్క్యులర్‌ను దృష్టిలో ఉంచుకుని రుణదాతలు తమ సొంత అంచనా వేసుకోవాలి. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/298 |