<font face="mangal" size="3">ఫిన్‌-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్‌పై అంతర& - ఆర్బిఐ - Reserve Bank of India
ఫిన్-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్పై అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘం నివేదిక
తేదీ: 08/02/2018 ఫిన్-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్పై అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘం నివేదిక ఫిన్-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ పై అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘంయొక్క నివేదికను, రిజర్వ్ బ్యాంక్ ఈరోజు వెబ్ సైట్లో ప్రచురించినది. నేపథ్యం ఫిన్-టెక్ మరియు డిజిటల్ బ్యాంకింగుకు సంబంధించిన నిబంధనలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్, శ్రీ సుదర్శన్ సేన్, ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్, ఆర్ బి ఐ, సారథ్యంలో ఒక అంతర్నియంత్రణా కార్య నిర్వాహక సంఘాన్ని నెలకొల్పింది. ఈ సంఘంలో, అందరు ఆర్థిక రంగ నియంత్రకులూ – భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) ఇంకా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఎంపిక చేసిన బ్యాంకుల, రేటింగ్ సంస్థల ప్రాతినిధ్యంగలదు. ఈ నివేదికపై వ్యాఖ్యలూ, సలహాలూ, ఇ-మైల్ లేదా తపాలా ద్వారా, చీఫ్ జనరల్ మానేజర్-ఇన్-చార్జ్, బ్యాంకింగ్ నియంత్రణ విభాగము, భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ కార్యాలయము, షహీద్ భగత్ సింగ్ మార్గ్, ముంబై -400001 చిరునామాకు, ఫిబ్రవరి 28, 2018 లోగా పంపవచ్చును. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2163 |