<font face="mangal" size="3">ప్ర‌స్తుత రూ.500 మ‌రియు రూ.1000 బ్యాంకు నోట్ల చ‌ట్ట&zwnj - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - నివేదన మరియు పర్యవేక్షణ - కౌంటర్ లు/ఏటీఎంల ద్వారా జారీ చేసే నోట్ల సమాచారం
RBI/2016-17/128 నవంబర్ 12, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - నివేదన మరియు పర్యవేక్షణ - కౌంటర్ లు/ఏటీఎంల ద్వారా జారీ చేసే నోట్ల సమాచారం దయచేసి ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - నివేదన మరియు పర్యవేక్షణ అంశానికి సంబంధించి మేము నవంబర్ 11, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No.1264/10.27.00/2016-17 ను గమనించండి. 2. పై సూచనలకు కొనసాగింపుగా బ్యాంకులు కౌంటర్ లు మరియు ఏటీఎంల ద్వారా జరిగే నగదు చెల్లింపుల వివరాలను సమర్పించాలని నిర్ణయించడమైనది. తదనుగుణంగా, Annex 6A ను సవరించడం (జతపరిచాం) జరిగింది. మీరు సమర్పించే డాటాను మా వైపు నుంచి సంకలనం చేయడానికి ఆ డాటాను నవంబర్ 13, 2016 నుండి Annex 6A తో పాటు జత పరిచిన ఎక్సెల్ ఫైలులో కూడా పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి రోజువారీ నివేదికలను మెయిల్ చేయాలని గుర్తించండి. మీ విశ్వసనీయులు, (విజయ్ కుమార్) Encl: పైన పేర్కొన్నవి రూ.500, రూ.1000 విలువ కలిగిన SBNలు మరియు అకౌంట్ల ద్వారా (కౌంటర్లు మరియు ఏటీఎంలు) నగదు విత్ డ్రాల స్వీకరణ గురించి RBI, DCM, సెంట్రల్ ఆఫీస్ కు ఈమెయిల్ పంపాల్సిన రోజువారీ నివేదిక ఫార్మాట్ బ్యాంకు పేరు: ...............................
|