RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521072

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., డిపాజిటర్లకు సొమ్ము ఉపసంహరణ పరిమితి రిజర్వ్ బ్యాంక్, రూ. 25, 000 వరకు పెంచినది

తేది: 03/10/2019

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., డిపాజిటర్లకు సొమ్ము ఉపసంహరణ
పరిమితి రిజర్వ్ బ్యాంక్, రూ. 25, 000 వరకు పెంచినది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., డిపాజిటర్లకు వారి ఖాతాలలోని మొత్తం నిల్వనుండి సొమ్ము ఉపసంహరణపై (విత్‌డ్రావల్) రూ. 10,000/- (రూపాయిలు పదివేలు) పరిమితి విధించిన విషయం మీకు తెలిసినదే.

రిజర్వ్ బ్యాంక్, డిపాజిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందినుండి మరికొంత ఊరట కల్గించడానికి, బ్యాంకుయొక్క లిక్విడిటీ పరిస్థితిని మరొకసారి సమీక్షించి, ఉపసంహరణ పరిమితి రూ. 25,000/- కు (ఇరవై ఐదు వేల రూపాయిలు) పెంచవలెనని నిశ్చయించింది.

పైన తెలిపిన సడలింపు కారణంగా, 70%నికి మించి డిపాజిటర్లు, వారి ఖాతాలోగల మొత్తం నిల్వ తిరిగి తీసుకోగలుగుతారు. బ్యాంక్ ఆర్థిక స్థితిని, రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. డిపాజిటర్ల సంక్షేమంకొరకు అవసరమైన చర్యలన్నీ, రిజర్వ్ బ్యాంక్ తీసుకొంటుంది.

ఇంతేగాక, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 36AAA(5)(A) (సెక్షన్‌ 56 తో కలిపి), క్రింద, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కార్యనిర్వాకుడికి (అడ్మినిస్ట్రేటర్) సహాయంగా, ముగ్గురు సభ్యులుగల కమిటీని నియమించాలని నిశ్చయించింది.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/861

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?