<font face="mangal" size="3">పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు లిమిĶ - ఆర్బిఐ - Reserve Bank of India
పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ డిపాజిటర్లకు ఉపసంహరణ పరిమితిని, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 40,000/- కు పెంచింది
తేది : 14/10/2019 పంజాబ్ మరియు మహారాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ డిపాజిటర్లకు పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డిపాజిటర్లకు వారి ఖాతాల్లోని మొత్తం మిగులులో ₹ 25,000/- (ఇరవై ఐదు వేల రూపాయిలు మాత్రమే) తీసుకొనవచ్చునని భారతీయ రిజర్వు బ్యాంకు అక్టోబర్ 03, 2019 న అనుమతి ఇచ్చింది. బ్యాంకు యొక్క ద్రవ్య లభ్యత మరియు దాని డిపాజిటర్లకు చెల్లించే సామర్థ్యాన్ని సమీక్షించిన తరువాత, ఉపసంహరణకు పరిమితిని ఇంతకుముందు అనుమతించిన ఇరవై ఐదు వేల రూపాయిలతో కలుపుకుని, ₹ 40,000/- (నలభై వేల రూపాయిలు మాత్రమే) కు పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. పై సడలింపుతో, బ్యాంక్ డిపాజిటర్లలో 77% మంది, వారి మొత్తం ఖాతా మిగులు ను ఉపసంహరించుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు చేసిన మోసం కారణంగా బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితి గణనీయంగా బలహీనపడింది. ఈ విషయం భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చిన వెంటనే, ఒక ‘నిర్వాహకుడి’ని (అడ్మినిస్ట్రేటర్) నియమించడం మరియు బ్యాంకుకు అందుబాటులో ఉన్న వనరులు రక్షించబడటం మరియు దుర్వినియోగం లేదా మళ్లించబడకుండా చూసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో, బ్యాంకులోని మోసం/ఖాతా పుస్తకాల తారుమారు/ఆర్థిక అవకతవకలతో సంబంధం ఉన్న తన అధికారులు మరియు రుణగ్రహీతలపై బ్యాంకు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఆర్ధిక నేరాల విభాగం, మహారాష్ట్ర పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా, సంబంధిత లావాదేవీలను పరిశీలించడానికి ఫోరెన్సిక్ ఆడిటర్లను బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ నియమించారు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 36AAA(5)(a) ప్రకారం ఆర్బిఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ మరియు ముగ్గురు సభ్యుల సలహా కమిటీ, కార్యకలాపాల నిర్వహణలో బ్యాంకు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వేగంగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది మరియు బ్యాంక్ డిపాజిటర్ల ప్రయోజనార్థం అవసరమైన చర్యలు నిరంతర ప్రాతిపదికన తీసుకుంటోంది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/942 |