<font face="mangal" size="3px">రిజర్వు బ్యాంకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆ - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వు బ్యాంకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డిపాజిటర్లకు డబ్బు వాపసు (విత్‌డ్రాయల్) పరిమితిని ₹ 50,000 / - కు పెంచింది
నవంబర్ 05, 2019 రిజర్వు బ్యాంకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ అక్టోబర్ 14, 2019 తారీఖున భారతీయ రిజర్వు బ్యాంకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పిఎంసి) బ్యాంక్ లిమిటెడ్ డిపాజిటర్లకు వారి ఖాతాల్లోని మొత్తం నిల్వలో ₹ 40,000/- (నలభై వేల రూపాయలు మాత్రమే) వరకు వాపసు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవలసినది. ఆ బ్యాంక్ లో ద్రవ్యలభ్యత స్థితి ని మరియు డిపాజిటర్లకు బ్యాంక్ చెల్లింపులు జరిపే సామర్థ్యాన్ని సమీక్షించిన అనంతరం, ఈ విత్‌డ్రాయల్ పరిమితిని ₹ 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) కు పెంచాలని (ఇంతకుమునుపు అనుమతించిన ₹ 40,000/- తో కలిపి) భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఈ సడలింపు మూలంగా, 78 శాతం పైచిలుకు ఆ బ్యాంకు డిపాజిటర్లు వారి ఖాతా నిల్వనంతా వాపసు చేసుకోగలుగుతారు. అంతేగాకుండా, బ్యాంక్ సొంత ఎటియంల నుండి నిర్ణీత పరిమితి ₹ 50,000 వరకు డిపాజిటర్లకు విత్‌డ్రాయల్ ను అనుమతించాలని కూడా నిర్ణయించబడింది. దీనివల్ల, విత్‌డ్రాయల్ ప్రక్రియ సులువౌతుందని భావిస్తున్నారు. రిజర్వు బ్యాంకు పరిస్థితిని చాలా నిశితంగా పరిశీలిస్తూ బ్యాంక్ డిపాజిటర్ల పరిరక్షణ కోసం అవసరమైనన్ని తదుపరి చర్యలను కొనసాగిస్తుంది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1110 |