RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505539

అల్వార్ ఆర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అల్వార్, రాజస్థాన్‌యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంకు రద్దుచేసినది

తేది: జులై 06, 2018

అల్వార్ ఆర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అల్వార్, రాజస్థాన్‌యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంకు రద్దుచేసినది

భారతీయ రిజర్వ్ బ్యాంక్, వారి ఆదేశం జులై 03, 2018 ద్వారా, అల్వార్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అల్వార్, రాజస్థాన్‌కు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుటకు జారీ చేసిన అనుమతిని, జులై 05, 2018 పనివేళల ముగింపు సమయంనుండి, రద్దుచేసినది. బ్యాంక్ మూసివేయుటకు ఉత్తరువులు జారీచేసి, లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్, రాజస్థాన్‌ను కోరడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింది కారణాలవల్ల బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినది:

i. బ్యాంకుకు చాలినంత మూలధనం, లాభార్జన అవకాశాలు లేవు. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 11(1) మరియు 22 (3) (d) (సెక్షన్‌ 56 తో కలిపి) నిబంధనలు పాటించుటలో బ్యాంక్ విఫలమైనది.

ii. బ్యాంకు వారి ప్రస్తుత, భవిష్య డిపాజిటర్లు కోరినప్పుడు వారి సొమ్ము పూర్తిగా చెల్లించేస్థితిలో లేదు. ఈకారణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 22 (3)(a) (సెక్షన్‌ 56 తో కలిపి) నిబంధనలు నెరవేర్చుటలో విఫలమైనది.

iii. బ్యాంకు కార్యకలాపాలు ప్రస్తుత / భవిష్య డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరంగా నిర్వర్తించబడుతున్నాయి. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 22 (3)(b) (సెక్షన్‌ 56తో కలిపి) నిబంధనల అమలులో విఫలమైనది.

iv. బ్యాంకుయొక్క ప్రస్తుత ఆర్థిక స్థితి, తిరిగి మెరుగయే అవకాశాలు లేవు.

v. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 22(3) (e) లో (సెక్షన్‌ 56 తో కలిపి) సూచించిన ప్రకారం, బ్యాంకును కొనసాగించుటలో ఎట్టి ప్రయోజనము ఉండదు. కాకపోగా, బ్యాంకింగ్ వ్యాపారంచేయుటకు మరికొంత సమయం అనుమతిస్తే, ప్రజా ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంది.

బ్యాంకింగ్ లైసెన్స్ రద్దుచేసిన కారణంగా, అల్వార్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. అల్వార్, రాజస్థాన్‌, బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ చట్టం, 1949, సెక్షన్‌ 5 (b) క్రింద (సెక్షన్‌ 56 తో కలిపి) నిర్వచించిన 'బ్యాంకింగ్' కార్యకలాపాలు (డిపాజిట్లు అంగీకరించుట / తిరిగి చెల్లించుటతోసహా) నిర్వహించుట, తక్షణం నిషేధించబడినది.

లైసెన్స్ రద్దుచేయడం, లిక్విడేషన్‌ చర్యలు మొదలుకావడంతో, అల్వార్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అల్వార్, రాజస్థాన్‌ ఖాతాదార్లకు, DICGC చట్టం, 1961 ప్రకారం, చెల్లింపులు చేసే ప్రక్రియ ప్రారంభమౌతుంది. లిక్విడేషన్‌ చర్యలు పూర్తికాగానే, ప్రతి ఖాతాదారు, వారి డిపాజిట్లు, రూ. 1,00,000/- (కేవలం లక్ష రూపాయిలు) పరిమితి వరకు, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ (DICGC) నియమ నిబంధనలకు అనుగుణంగా, తిరిగి పొందుటకు అర్హులౌతారు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/69

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?