RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499362

లోక్‌సేవా సహకారి బ్యాంక్ లి., పుణే, మహరాష్ట్ర, లైసెన్స్ రద్దుచేసిన రిజర్వ్ బ్యాంక్

తేదీ: సెప్టెంబర్ 18, 2017

లోక్‌సేవా సహకారి బ్యాంక్ లి., పుణే, మహరాష్ట్ర,
లైసెన్స్ రద్దుచేసిన రిజర్వ్ బ్యాంక్.

భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెప్టెంబర్ 14, 2017 తేదీన జారీచేసిన వారి ఆదేశాల ద్వారా, లోక్‌సేవా సహకారి బ్యాంక్ లి., పుణే, మహరాష్ట్ర కు బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగించడానికి జారీ చేసిన లైసెన్స్, సెప్టెంబర్ 18, 2017 పనివేళల ముగింపు సమయంనుండి, రద్దుచేసినది. రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్‌, మహారాష్ట్రాను బ్యాంక్ మూసివేతకు ఆదేశాలిచ్చి, లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా కోరడం జరిగింది.

బ్యాంక్‌యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఈ క్రింది కారణాలవల్ల రద్దుచేసింది:

  1. బ్యాంక్‌కు తగినంత మూలధన వ్యవస్థ, లాభాలు గడించే ఆస్కారము లేవు. అందువల్ల బ్యాంకింగ్ నియంత్రణ చట్టం1949, సెక్షన్‌ 11(1), సెక్షన్‌ 22(3)(d) (సెక్షన్‌ 56 తో కలిపి) లో చెప్పిన నిబంధనలు పాటించడంలో విఫలమయినది.

  2. బ్యాంకు, వారి ప్రస్తుత / భవిష్య డిపాజిటర్లు, హక్కురీత్యా కోరినప్పుడు, పూర్తి చెల్లింపు చేయగల స్థితిలో లేదు. అందువల్ల బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 22(3)(a) (సెక్షన్‌ 56 తో కలిపి) లో ఉన్న నిబంధనలు పాటించడంలో విఫలమయింది.

  3. బ్యాంకు కార్యకలాపాలు, ప్రస్తుత /భవిష్య డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగేవిధంగా నిర్వహించబడుతున్నాయి. అందువల్ల సెక్షన్‌ 22 (3)(b), (సెక్షన్‌ 56 తోసహా) నిబంధనలు పాటించడంలో విఫలమయింది.

  4. బ్యాంక్ కు ఎప్పటికప్పుడు తగినంత సమయం మరియు అవకాశం ఇచ్చినప్పటికీ, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితి దాని పునరుజ్జీవనానికి ఏ విధమైన అవకాశాలు లేవు.

  5. మూలధనం పెంచుటకు, ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు, ఏ చర్యలూ తీసికోలేదు. పునరుద్ధరణకు, బ్యాంక్ వద్ద ఎటువంటి పటిష్ఠమైన ప్రణాళికా లేదు. బ్యాంక్ మరొక ధృడమైన బ్యాంకుతో విలీనమవడానికి ఎటువంటి నిర్దిష్ట ప్రణాళిక సమర్పించలేదు. అందువల్ల బ్యాంకుకు తగినంత సమయం, అవకాశం ఇచ్చినాగాని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుచేసుకోవడానికి, ఎట్టి కృషీ చేయలేదని, మార్చ్ 31, 2013, మార్చ్ 31, 2014 మరియు మార్చ్ 31, 2015 ఆర్థిక స్థితి పరిశీలనలో తేలింది. ఈ కారణంగా, యాజమాన్యం వైఖరి, ప్రజలకు / ఖాతాదార్లకు హానికరంగా ఉంది.

  6. సెక్షన్‌ 22(3) (e) బ్యాంక్ నియంత్రణ చట్టం 1949, ప్రకారం, బ్యాంక్ కొనసాగడానికి అనుమతించినా, ప్రయోజనం ఉండదు. పైపెచ్చు, ఇంకా బ్యాంకు కొనసాగడానికి అనుమతిస్తే, ప్రజాశ్రేయస్సుకు భంగకరమౌతుంది.

2. లోక్‌సేవా సహకారి బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర, లైసెన్స్ రద్దుచేసిన కారణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 5 (b) లో (సెక్షన్‌ 56తో కలిపి), నిర్వచించిన 'బ్యాంకింగ్' కార్యకలాపాలు (డిపాజిట్లు అంగీకరించడం / తిరిగి చెల్లించడంతో సహా) జరపడం, తక్షణం నిషేధించబడినది.

3. లైసెన్స్ రద్దుచేయడం, లిక్విడేషన్‌ చర్యలు మొదలుకావడంతో, లోక్‌సేవా సహకారి బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర ఖాతాదార్లకు, DICGC చట్టం, 1961 ప్రకారం, చెల్లింపులు చేసే ప్రక్రియ ప్రారంభమౌతుంది. లిక్విడేషన్‌ చర్యలు పూర్తికాగానే, ప్రతి ఖాతాదారు, వారి డిపాజిట్లు, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ (DICGC) సాధారణ నియమ నిబంధనల ప్రకారం, 1,00,000/- (కేవలం లక్ష రూపాయిలు) పరిమితి వరకు తిరిగి పొందుటకు అర్హులౌతారు.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/766

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?