<font face="mangal" size="3">భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా స్పస్టీకరణ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా స్పస్టీకరణ
మార్చ్ 16, 2019 భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా స్పస్టీకరణ ఫిబ్రవరి 12, 2018 న జారీ చేయబడిన ‘ఒత్తిడితో కూడిన ఆస్తుల పరిష్కారంపై సవరించిన ముసాయిదాకు’ సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు వైఖరి గురించి కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. ఈ విషయం సబ్-జ్యుడిస్ మరియు గౌరవనీయమైన సుప్రీంకోర్టు తన ఆదేశాలను నిలిపి ఉంచిన కారణంగా, ఈ విషయంపై, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దిష్ట వివరాలపై వ్యాఖ్యానించదు. ఏది ఏమయినప్పటికీ, ఫిబ్రవరి 07, 2019 న ద్రవ్యానంతర విధాన విలేకరుల సమావేశంలో ఇచ్చిన స్పష్టతతో సహా, రిజర్వ్ బ్యాంక్ తన సమాచారంలో స్థిరంగా పేర్కొన్న విధంగా, ముసాయిదా యొక్క అన్ని అంశాలపై తన వైఖరిని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించడమైనది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన: 2018-2019/2213 |