<font face="mangal" size="3">బంధన్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్ķ - ఆర్బిఐ - Reserve Bank of India
బంధన్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
తేదీ: 29/10/2019 బంధన్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22 క్రింద సమకూరిన అధికారాలను వినియోగించుకొని, బ్యాంకింగ్ లైసెన్స్ జారీ చేసే సమయంలో ప్రమోటర్ హోల్డింగ్‌పై ఫిబ్రవరి 22, 2013 న జారీ చేసిన 'ప్రైవేట్ రంగంలో కొత్త బ్యాంకుల లైసెన్సింగ్ కోసం మార్గదర్శకాలు' (లైసెన్సింగ్ మార్గదర్శకాలు) అనుపాలనలో విఫలమైనదన్న కారణంగా, బంధన్ బ్యాంకు లిమిటెడ్ ఫై అక్టోబర్ 29, 2019 నాటి ఆదేశం ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i)తో కలిపి, సెక్షన్ 47A(1)(c) క్రింద ఆర్.బి.ఐ కి సమకూరిన అధికారాలను వినియోగించుకొని పైన పేర్కొన్న లైసెన్సింగ్ మార్గదర్శకాల అనుపాలన ఉల్లంఘన కొరకు విధించడం జరిగింది. ఈ చర్య, నియంత్రణ అనుపాలన లోపాల పై చేపట్టిన చర్య మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉంటుందని ఉద్దేశించినది కాదు. నేపథ్యం లైసెన్సింగ్ షరతులతో కూడిన పైన పేర్కొన్న లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు తన నాన్-ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ వాటాను, మొత్తం చెల్లించిన ఈక్విటీ క్యాపిటల్‌లో 40% కంటే ఎక్కువ ఉన్న వాటాను, బ్యాంకు వ్యాపారం ప్రారంభించిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు 40% కు తగ్గించాల్సిన అవసరం ఉంది. లైసెన్సింగ్ మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు (SCN) జారీ చేయబడింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణ లో బ్యాంకు ఇచ్చిన నివేదనలను మరియు ఇతర దస్తావేజుల పరిశీలన తరువాత, లైసెన్సింగ్ షరతులతో కూడిన లైసెన్సింగ్ మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1051 |